Social Service: నేనున్నాను..కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు రాంచీలో ఓ ఆటో డ్రైవర్ భరోసా..ఉచితంగా ఆసుపత్రికి చేరుస్తున్న వైనం
కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న వేళలో ప్రజల ఇబ్బందులు చెప్పనలవి కావు. వారు ఆసుపత్రికి వెళ్ళాలన్నా వాహనం దొరకని పరిస్థితి. కోవిడ్ లక్షణాలుంటే అంబులెన్స్ లు కూడా సమయానికి దొరకడం కష్టతరం అయిపోతోంది.
Social Service: కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న వేళలో ప్రజల ఇబ్బందులు చెప్పనలవి కావు. వారు ఆసుపత్రికి వెళ్ళాలన్నా వాహనం దొరకని పరిస్థితి. సాధారణ ప్రజలు కోవిడ్ పరీక్షల కోసం వెళ్ళడం దగ్గర నుంచి, కోవిడ్ లక్షణాలుంటే ఆసుపత్రిలో చేరాలన్నా అంబులెన్స్ లు కూడా సమయానికి దొరకడం కష్టతరం అయిపోతోంది. ఈ ఇబ్బందుల నుంచి రక్షించడానికి రాంచీలో ఓ ఆటోడ్రైవర్ చేస్తున్న పని ఇప్పుడు అందరి మన్ననలూ పొందుతోంది. ఈ ఆటో డ్రైవర్ కొనసాగుతున్న కరోనా మహమ్మారి మధ్య ఆసుపత్రులకు వెళ్లవలసిన వ్యక్తులకు ఉచిత రైడ్‌లు ఇస్తున్నాడు. రవి అగర్వాల్ అనే ఆటోడ్రైవర్ వార్తా సంస్థ ANI తో మాట్లాడుతూ, తన ఆటోలో అవసరమైన ఎవరికైనా ఉచిత ప్రయాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గత వారం నుంచి ఇలా చేయడం ప్రారంభించానని చెప్పారు.
గత ఏప్రిల్ 15, గురువారం జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్న రవి, అనారోగ్యంతో ఉన్న మహిళా ప్రయాణీకురాలు రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) కు ప్రయాణించాలని కోరారు. కానీ, ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో ఏ ఆటో డ్రైవర్ సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. అప్పుడు రవి ఆ మహిళకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఆమెకు ఆసుపత్రికి ఉచితంగా తీసుకువెళ్ళారు.అప్పటి నుండి, రవి ఎటువంటి డబ్బు వసూలు చేయకుండా ప్రయాణీకులను ఆసుపత్రికి తీసుకువెళుతున్నాడు. “ప్రతి ఒక్కరూ నిరాకరించిన తరువాత నేను రిమ్స్ వద్ద ఒక మహిళను వదిలిపెట్టిన తరువాత నుంచి నేను ఇలా చేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో ఉంది కాబట్టి ప్రజలు నన్ను సంప్రదించవచ్చు” అని ఆయన ANI కి చెప్పారు.
ఆటోడ్రైవర్ రవి చేస్తున్న సహాయంపై ఏఎన్ఐ ట్వీట్!
Jharkhand: An auto driver in Ranchi offers free ride to people who need to go to hospitals, amid #COVID19 pandemic. Ravi, the driver says, “Doing this since 15th April when I dopped a woman at RIMS after everyone else refused. My number’s on social media so people can contact me” pic.twitter.com/HkL49rzUni
— ANI (@ANI) April 23, 2021
రవి తన ఆటో ముందు ‘ఫ్రీ ఎమర్జెన్సీ సర్వీసెస్’ అనే బోర్డ్ కూడా తగిలించారు. ఇందులో అతని మొబైల్ నంబర్‌ను కూడా ఇచ్చారు. దీనిద్వారా ప్రజలు అతన్ని అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవచ్చు. రవి కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఈ క్లిష్ట సమయాల్లో ప్రజలకు సహాయం చేయడానికి ఆయన అంగీకరించడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. “ఇది చాలా అవసరం. ఈ కష్ట సమయంలో సహకారం ఉత్తమమైనది. అతను భారీ గౌరవానికి అర్హుడు, ”అని ఒక ట్విట్టర్ యూజర్ చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఇండియాలో కరోనా మహమ్మారి మరింత విరుచుకుపడుతోంది. కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న కారణంగా భారతదేశం ప్రస్తుతం భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం ఇచ్చిన సమాచారం ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 3,32,730 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
Thaman: ఆ వీడియో చూసి చలించి పోయిన థమన్.. తనలో ఓ కొత్త కల మొదలైంది.. ఇంతకీ ఏంటా వీడియో…