Thaman: ఆ వీడియో చూసి చలించి పోయిన థమన్.. తనలో ఓ కొత్త కల మొదలైంది.. ఇంతకీ ఏంటా వీడియో…
Thaman: మనిషి జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఒక చిన్న సంఘటన చాలు. ఆ సంఘటన తాలుకు తీవ్రత మనిషి ఆలోచనను పూర్తిగా మార్చేస్తోంది. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే...
Thaman: మనిషి జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఒక చిన్న సంఘటన చాలు. ఆ సంఘటన తాలుకు తీవ్రత మనిషి ఆలోచనను పూర్తిగా మార్చేస్తోంది. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే ఉన్నారు సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్. సోషల్ మీడియాలో చూసిన ఓ వీడియో థమన్‌కు కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. తమిళనాడుకు చెందిన ఓ అవ్వ ఆకలితో అలమటిస్తోంది. దీంతో స్పందించిన ఓ వ్యక్తి ఆ అవ్వకు వాటర్ బాటిల్‌తో పాటు ఆహారాన్ని అందించాడు. వాటిని తీసుకున్న ఆ అవ్వ సదరు వ్యక్తికి డబ్బులు ఇవ్వబోయింది. దీంతో ఆ వ్యక్తి వద్దని వారిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ముసలవ్వ హావభావాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ వీడియో కాస్త థమన్ కళ్లలో పడింది. దీంతో చలించి పోయిన ఆయన ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఈ వీడియో చూసి నా హృదయం ముక్కలైంది. ముసలి వాళ్లకు చేయూతనందించేందుకు ఓ వృద్ధాశ్రమాన్ని నిర్మించాలనే కల నాలో మొదలైంది. త్వరలోనే ఆ పనిని పూర్తి చేస్తాను. దేవుడు దానికి కావాల్సిన బలాన్ని నాకు అందిస్తాడని కోరుకుంటున్నాను. నేను ఈ మెసేజ్ టైప్ చేసేటప్పుడు నా కంట్లో నుంచి నీళ్లు దూకుతున్నాయి. దయచేసే ఆహారాన్ని వృథా చేయొద్దు. అవసరంలో ఉన్న వారికి సహాయం అందించండి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు థమన్. మరి థమన్ కంటోన్న ఈ గొప్ప కల నిజం కావాలని మనమూ కోరుకుందామా..?
థమన్‌ను భావోద్వేగానికి గురి చేసిన వీడియో ఇదే..
My heart jus broke into pieces A new dream started in me to build a old age home ? will make it soon I wish god gives me the strength and support to make it …
I was typing this with tears rolling Don’t waste food Serve food for the needy
? Let’s be HUMANS ✊♥️ https://t.co/gxHSF1ML2w
— thaman S (@MusicThaman) April 25, 2021
Corona Effect: ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు.. బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక