సూపర్ స్టార్ స్టార్ కృష్ణ పుట్టిన రోజునాడు అదిరిపోయే సర్ప్రైజ్ లు ఇవ్వనున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస విజయాలతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు మహేష్
super star krishna : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస విజయాలతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు మహేష్.. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు మహేష్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఉండనుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటె ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమా కరోనా కారణంగా ప్రస్తుతానికి షూటింగును ఆపేయవలసి వచ్చింది. పరిస్థితులు అనుకూలించగానే తిరిగి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
త్రివిక్రమ్ – మహేశ్ బాబు ప్రాజెక్టును లాంచ్ చేయడానికి ముహూర్తం ఖాయమైపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మే 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. అందువలన ఆ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక అదే రోజున ‘సర్కారువారి పాట’ నుంచి మహేశ్ బాబు ఫస్టులుక్ రానుందని అంటున్నారు. మొత్తానికి కృష్ణ పుట్టిన రోజున అభిమానులకు డబుల్ సర్ఫరైజ్ ఇవ్వనున్నాడు మహేష్.
మరిన్ని ఇక్కడ చదవండి :