రికార్డ్ క్రియేట్ చేసిన సిద్ శ్రీరామ్ పాట.. భారీ వ్యూస్ దక్కించుకున్న ‘ఒకేఒక లోకం నువ్వే’ పాట..

యంగ్ హీరో అది సాయికుమార్ చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు.

రికార్డ్ క్రియేట్ చేసిన సిద్ శ్రీరామ్ పాట.. భారీ వ్యూస్ దక్కించుకున్న 'ఒకేఒక లోకం నువ్వే' పాట..
Sashi
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 26, 2021 | 6:42 AM

యంగ్ హీరో అది సాయికుమార్ చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. కెరియర్ మొదట్లో ప్రేమకావాలి, లవ్లీ  వంటి సినిమాలతో హిట్ ను అందుకున్నాడు ఆతర్వాత ఆదికి చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. చూస్తుండగానే ఆది సాయికుమార్ తన కెరియర్ ను మొదలెట్టేసి పదేళ్లు అవుతోంది. ఇటీవల శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడికట్ల తెరకెక్కిస్తున్నాడు. రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్పీ వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా అందులోని ఒకేఒక లోకం నువ్వు పాట సంచలనం సృష్టించింది.

చంద్రబోస్ పాటకు అందమైన లిరిక్స్ అందించగా అంతే చక్కగా తన మ్యూజిక్ తో పాటను నిలబెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు. ఇక తన మధురమైన గాత్రంతో ప్రాణం పోసాడు సింగర్ సిద్ శ్రీరామ్. ఇదివరకే సిద్ పాడిన ఎన్నో పాటలు 100మిలియన్స్ రికార్డును బ్రేక్ చేసాయి. ఇప్పుడు వాటి జాబితాలో ఒకే ఒక లోకం చేరడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

pawan kalyan: అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లోమార్పులు.. పవన్ కోసం ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారట..

RRR: ఆర్ఆర్ఆర్ లో అందమైన ప్రేమకావ్యం.. ఇద్దరు భామలతో ఎన్టీఆర్ ప్రేమాయణం

నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం బాలకృష్ణ.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య వీడియో..:Akhanda Teaser video.