ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఆక్సిజన్ మళ్లింపును ఆపండి, ప్రధానికి తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ మళ్లింపును ఆపాలని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోదీని  కోరారు.

  • Publish Date - 8:01 pm, Sun, 25 April 21 Edited By: Phani CH
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఆక్సిజన్ మళ్లింపును ఆపండి, ప్రధానికి తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖ
Palaniswami

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ మళ్లింపును ఆపాలని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోదీని  కోరారు. ఈ మళ్లింపు వల్ల  తమ రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నై, ఇతర జిల్లాల్లో తీవ్ర సంక్షోభానికి దారి తీసే ప్రమాదముందని ఆయన అన్నారు.  ఇప్పటివరకు తమ రాష్ట్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఇతర రాష్ట్రాలకు సహకరించేందుకు  తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. .కోవిడ్ కేసులు పెరిగిపోయిన దృష్ట్యా, తమ రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ అవసరాలు కూడా పెరిగిపోయాయని, ఈ కారణంగా తమిళనాడులో తగినంత ఆక్సిజన్ లభ్యత ఉండేలా చూడాల్సి ఉందని ఆయన ప్రధానికి రాసిన లేఖలో వెల్లడించారు. నేషనల్ ప్లాన్ కింద తమ రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపు చాలా తక్కువగా ఉందని, ఇది తప్పు అని ఆయన ఘాటుగా విమర్శించారు. సమీప భవిష్యత్తులో తమిళనాడుకు 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని, కానీ ప్రస్తుత ప్రొడక్షన్ కెపాసిటీ 400 మెట్రిక్ టన్నులు  మాత్రమేనని  పళనిస్వామి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం 310 మెట్రిక్ టన్నులకు చేరుకుంది.. కానీ కేంద్రం 210 టన్నులు మాత్రమే కేటాయించింది అని ఆయన తెలిపారు.

చెన్నై నగరానికి ఆక్సిజన్ సరఫరా చేసే శ్రీపెరంబుదూరు లోని ప్లాంట్ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మళ్లింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మా రాష్ట్రంలో గత కోవిడ్ సమయంలో 58 వేల యాక్టివ్ కేసులు ఉండగా అవి ఇప్పుడు లక్షకు పెరిగిపోయాయని  పళనిస్వామి వెల్లడించారు. కొన్ని రాష్ట్రాలు స్టీల్ పరిశ్రమలకు దగ్గరలో  ఉన్నాయని, అందువల్ల ఆ పరిశ్రమల నుంచి ఆ రాష్ట్రాలు ఆక్సిజన్ ను తీసుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Andhrapradesh: ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. 104 కాల్ సెంటర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌త్యేక అధికారులు

కొత్తగా కారు కొనేవారికి షాక్‌.. భారీగా ధరలు పెంచిన కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌