AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్లీజ్ ! హెల్ప్ !’ ఆక్సిజన్ కొరతను తీర్చాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు కేజ్రీవాల్ లేఖ

ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న తమ రాష్ట్రానికి ఆక్సిజన్ ని పంపి ఆదుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కోరారు.

'ప్లీజ్ ! హెల్ప్ !' ఆక్సిజన్ కొరతను తీర్చాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు కేజ్రీవాల్ లేఖ
Arvind Kejriwal
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Apr 25, 2021 | 9:03 PM

Share

ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న తమ రాష్ట్రానికి ఆక్సిజన్ ని పంపి ఆదుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కోరారు. నిన్న ఆయన ఇదే అభ్యర్థనతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం ఆయన ఇండస్ట్రియలిస్టులకు కూడా లేఖలు రాస్తూ.. దయ చేసి తమ ప్రభుత్వానికి సాయపడాలని, ఆక్సిజన్, ట్యాంకర్లను పంపాలని, ఏ రూపంలోనైనా సహాయపడాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాలకు  ఆక్సిజన్ కోటాను కేటాయించినప్పటికీ అది ఏ మూలకూ సరిపోలేదని ఆయన తెలిపారు. మా వద్ద ఉన్న వనరులన్నీ అయిపోయాయి అని తెలిపారు. ఈ లేఖలను  ఎస్ ఓ ఎస్ మెసేజులుగా భావించాలని కేజ్రీవాల్ కోరారు.  ఈ తరుణంలో అంతా కలిసి సంక్షోభ నివారణకు కృషి చేయాల్సి ఉందని, సమర్థవంతమైన గవర్నెన్స్ అంటే ఏమిటో ప్రపంచానికి చూపాలని అన్నారు. కేంద్రం గతవారం  ఢిల్లీకి ఆక్సిజన్ కోటాను 380 నుంచి 480 మెట్రిక్ టన్నులకు పెంచింది. అయితే ఇది చాలదని ప్రభుత్వం అంటోంది. తమకు 700 టన్నుల ఆక్సిజన్ అవసరమని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇటీవల అన్నారు.

అయితే నిన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన కొద్దిసేపటికే బీజేపీ రంగంలోకి దిగింది. ఢిల్లీలో 8 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి గత డిసెంబరులోనే కేంద్రం   నిధులు కేటాయించినా ఈ ప్రభుత్వం  కేవలం ఒక్క ప్లాంటునే ఏర్పాటు చేసిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా తీవ్రంగా ఎదురు దాడికి దిగారు.   ఈ పార్టీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ కూడా ఇలాగే ట్వీట్ చేశారు. ఇచ్చిన నిధులను వినియోగించుకోలేదని దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణలపై కేజ్రీవాల్ గానీ, ఆప్ నేతలు గానీ నోరెత్తలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు ! విశాఖ బీచ్ లో అరుదైన తాబేలు..వైరల్ వీడియో..Huge Turtle carcass video.

India-US Flights: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మూడు రెట్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే..!