Sasikala Politics: రాజకీయాలకు దూరం దూరం.. కానీ ఆపోరులో చిన్నమ్మది అదే దూకుడు.. ఎంటంటే?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా రాజకీయ సన్యాసాన్ని ప్రకటించిన శశికళ (చిన్నమ్మ) తెరచాటు రాజకీయాలను మాత్రం కొనసాగిస్తూనే వుంది. పేరుకే రాజకీయాలకు రామ్ రామ్.. కానీ రాజకీయాలపై మాత్రం అదే ఆసక్తి.

Sasikala Politics: రాజకీయాలకు దూరం దూరం.. కానీ ఆపోరులో చిన్నమ్మది అదే దూకుడు.. ఎంటంటే?
Tamilnadu Politics
Follow us

|

Updated on: Apr 25, 2021 | 7:02 PM

Sasikala Politics unstoppable in Tamilnadu: తమిళనాడు అసెంబ్లీ (TAMILNADU ASSEMBLY) ఎన్నికలకు ముందు అనూహ్యంగా రాజకీయ సన్యాసాన్ని ప్రకటించిన శశికళ (చిన్నమ్మ)  తెరచాటు రాజకీయాలను మాత్రం కొనసాగిస్తూనే వుంది. పేరుకే రాజకీయాలకు రామ్ రామ్.. కానీ రాజకీయాలపై మాత్రం అదే ఆసక్తి. కేవలం ఆసక్తే కాదు.. తెరచాటుగా రాజకీయ పావులు కూడా కదుపుతున్నారు శశికళ (SASIKALA). అస్త్ర సన్యాసం చేసిన తర్వాత పూర్తిగా ఆధ్యాత్మికంగా వుండిపోతున్నట్లు పైకి కనిపించినా.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. పరోక్షంగా అన్నా డిఎంకే (ANNA DMK) పార్టీపై పట్టుకు యత్నిస్తూనే వున్నారు. అన్నాడీఎంకేపై న్యాయస్థానంలో ఆమె సాగిస్తున్న ఆధిపత్య పోరు కొనసాగిస్తూనే వున్నారు. జయలలిత (JAYALALITA) జీవించి ఉన్నంత వరకు నీడలా ఆమె వెన్నంటి ఉండిన శశికళ ఆ తరువాత ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అంతా జయను పోలినట్లుగా చీరకట్టు, నుదుటన బొట్టు, పాద నమస్కారాలు, ఆశీర్వచనాలతో ప్రారంభమైన చిన్నమ్మ వైభవం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునే వరకు సాగింది. జయలలిత మరణించిన సమయంలో ముఖ్యమంత్రి (CHIEF MINISTER)గా ఉండిన పన్నీర్‌సెల్వం (PANNIR SELVAM)ను బలవంతంగా బాధ్యతల నుంచి తప్పించి ముఖ్యమంత్రిని అవుదామనుకున్న శశికళ ఆమెను నీడలా వెంటాడిన అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు.

అయితే జైలుకు వెళ్ళే ముందు తన అనుచరుడైన ఎడప్పాడి పళనిస్వామి (PALANI SWAMY)ని సీఎం (CM) చేశారు. తన అల్లుడు, అన్న కుమారుడు అయిన టీటీకే దినకరన్ (TTK DINAKARAN)‌కు పార్టీ పగ్గాలప్పగించారు. అయితే.. చిన్నమ్మ జైలులో వున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వ్యూహాత్మకంగా పళని స్వామిని మచ్చిక చేసుకుని చిన్నమ్మ ఆశలకు గండికొట్టారు. దినకరన్‌ను పార్టీ నుంచి సాగనంపారు. పళనిస్వామి, దినకరన్‌ను గ్రిప్‌లో పెట్టుకోవడం ద్వారా జైలునుంచే తమిళ రాజకీయాలను శాసిద్దామనుకున్న చిన్నమ్మకు ఫళనిస్వామి, పన్నీరు సెల్వం కలిసి పోవడంతో షాక్ తగిలింది. వీరిద్దరు కలిసి పార్టీలో చిన్నమ్మ వర్గాన్ని నయానాభయానా లొంగదీసుకున్నారు. అయిదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు తమిళనాడు సిట్టింగ్ సీఎం పళని స్వామి. అయితే.. ఈ క్రమంలో టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి సాగనంపడం, శశికళ, దినకరన్‌లను బహిష్కరిస్తూ అన్నాడీఎంకే జనరల్‌ బాడీ సమావేశంలో చేసిన తీర్మానాలు వివాదాస్పదమయ్యాయి. ఇంకోవైపు అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ, దినకరన్‌ న్యాయస్థానంలో జరిపిన పోరాటం విఫలమైంది.

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నశశికళ.. తిరిగి రాగానే పార్టీని హస్తగతం చేసుకునేందుకు పెద్ద ఎత్తే వేశారు. అత్యంత ఆర్భాటంగా బెంగళూరు (BANGALORE) నుంచి చెన్నై (CHENNAI) చేరుకున్నారు. కానీ పరిస్థితి తారుమారైంది. అప్పటికే పళనిస్వామి, పన్నీరు సెల్వం పార్టీపైనా, ప్రభుత్వంపైనా పట్టు సాధించారు. దాంతో చిన్నమ్మకు వేలు పెట్టేందుకు ఎక్కడా చోటే దొరకలేదు. దానికి తోడు వెంటనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు (ASSEMBLY ELECTIONS SCHEDULE) విడుదలైంది. సమయం కూడా లేదు. దాంతో దినకరన్ పార్టీ ద్వారా కొంత రాజకీయం చేసేందుకు యత్నించి విఫలమయ్యారు. సమయానికి బీజేపీ (BJP) రంగంలోకి దిగడంతో శశికళకు మరో దారి లేకపోయింది. అన్నాడీఎంకే–బీజేపీ కూటమి (ANNA DMK – BJP ALLIANCE) సీట్ల సర్దుబాటులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శశికళ అధికారికంగా ప్రకటించి అందరికీ షాకిచ్చారు. జయలలిత ఎంతగానే ప్రేమించిన అన్నాడీఎంకేను దెబ్బతీయడం, అమ్మ తీవ్రంగా ద్వేషించిన డీఎంకే (DMK)కు సహకరించడమే అవుతుందనే ఆలోచనతో రాజకీయాలకు దూరమవుతున్నట్లు ఆమె ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న సమయంలో చిన్నమ్మ ఆధ్యాత్మిక బాట పట్టారు. రాష్ట్రంలోని ఆలయాలను సందర్శిస్తూ కాలం గడిపారు.

ఇదంతా ఓవైపే.. మరోవైపు తనకున్న ఏకైక దారి న్యాయపోరాటమేనంటూ మద్రాసు హైకోర్టు (MADRAS HIGH COURT)లో కొనసాగుతున్న కేసును తనకు అనుకూలంగా మలచుకునేందుకు యత్నాలు మొదలు పెట్టారు. రాజకీయ సన్యాసం ప్రకటించినా అన్నాడీఎంకేపై శశికళ పోరు కొనసాగిస్తూనే వున్నారు. న్యాయస్థానం సాక్షిగా ఈ విషయాన్ని నమ్మక తప్పదు. ఆదాయానికి మించిన ఆస్తు కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2017 సెప్టెంబర్‌ 12న అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, నిర్వాహకునిగా టీటీవీ దినకరన్‌లను గత సమావేశంలో ఎన్నుకోవడం చెల్లదని పేర్కొంటూ తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శశికళ, దినకరన్‌ సదరు జనరల్‌ బాడీ సమావేశం చెల్లదని ప్రకటించాల్సిందిగా మద్రాసు సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. అంతేగాక ఆనాటి సమావేశంలో చేసిన 12 తీర్మానాలు చెల్లవని ప్రకటించాలని కోరారు. శశికళ ఈ కేసును కొనసాగించాలని కోరుకుంటుండగా.. ఆమె అన్న కుమారుడు దినకరన్ మాత్రం తాను స్వయంగా వేరే పార్టీ పెట్టుకున్నందున ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు గతంలోనే ప్రకటించారు.

రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన శశికళ ఈ కేసును మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఇదే సమయంలో శశికళ కేసును కొట్టి వేయాలని కోరుతూ అన్నాడీఎంకే తరఫున మరో పిటిషన్‌ దాఖలైంది. అన్నాడీఎంకే వేసిన పిటిషన్‌కు బదులివ్వాల్సిందిగా న్యాయస్థానం గత విచారణ సమయంలో శశికళను కోరింది. ఈ కేసు ఇటీవల విచారణకు రాగా, న్యాయమూర్తి సెలవుపై ఉన్నందున జూన్‌ 18వ తేదీకి వాయిదావేశారు. శశికళ వైఖరిని పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (TAMILNADU ASSEMBLY ELECTION RESULTS 2021) ఆధారంగా శశికళ చక్రం తిప్పుతారని అంఛనా వేస్తున్నారు.

ALSO READ: జూరాల వద్ద కృష్ణా నీటిని తరలించేందుకు కర్ణాటకం.. రాజుకుంటున్న మరో జలవివాదం!

ALSO READ: తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ విజ‌ృంభణ.. నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సర్కార్లు సీరియస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..