కొన్ని సార్లు భయం కూడా మనిషి చావుకు కారణం కావచ్చు.. రెంజల్‌ పీహెచ్‌లో జరిగిన ఘటనతో చాలా నేర్చుకోవాలి: పిజిషియన్‌

Covid-19 Fear: తెలంగాణలో కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వచ్చి కొందరు చనిపోతుంటే.. కరోనా రిపోర్టులు రాకముందు ఎక్కడ పాజిటివ్‌ వస్తుందేమోనన్న..

కొన్ని సార్లు భయం కూడా మనిషి చావుకు కారణం కావచ్చు.. రెంజల్‌ పీహెచ్‌లో జరిగిన ఘటనతో చాలా నేర్చుకోవాలి: పిజిషియన్‌
Doctor
Follow us
Subhash Goud

|

Updated on: Apr 26, 2021 | 3:20 PM

Covid-19 Fear: తెలంగాణలో కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వచ్చి కొందరు చనిపోతుంటే.. కరోనా రిపోర్టులు రాకముందు ఎక్కడ పాజిటివ్‌ వస్తుందేమోనన్న భయంతో మరి కొందరు మరణిస్తున్నారు. ఇక తాజాగా నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్న కరోనా టెస్టులకు వచ్చి రిపోర్టులు రాకముందు చెట్టు కింద సేద తీరుతుండగా, తల్లి ఒడిలోనే అశోక్‌ కన్నుమూసిన ఘటన అందరిని కలిచివేస్తోంది. అయితే ఈ ఘటన ద్వారా చాలా నేర్చుకోవాలని అంటున్నారు నిజామాబాద్‌ జనరల్ పిజిషియన్ డాక్టర్‌ తిరుపతి రావు. ఆయన సోమవారం టీవీ9తో మాట్లాడుతూ..

ర్యాపిడ్‌ టెస్ట్లో, ఆర్టీపీసీఆర్‌లో వచ్చిన రిపోర్టులో కరోనా లేదని నిర్ధారణ అయినట్లు కాదని.. అశోక్‌ శ్వాస సంబంధిత సమస్యతో చనిపోయినట్లు తెలుస్తోంది. జ్వరం ఉండి కూడా నెగెటివ్‌ వచ్చిందంటే వైరస్‌ శరీరంలో లేదని కాదని ఆయన అంటున్నారు. కొంత మంది ఆక్సిజన్‌ లెవల్స్‌ 60 శాతం ఉన్నా మనిషి యాక్టివ్‌ కనిపిస్తారు.. దీనిని హ్యాపీ హైపాక్సామి అంటారు. అంటే మనిషి అప్పటి వరకు భాగానే ఉండి ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని బయట చాలా మంది తిరగడం కూడా వైరస్‌ వ్యాప్తికి కారణంగా మారుతుంది అని టీవీ9తో తెలిపారు. లక్షణాలున్నా 8 రోజుల్లో సిటీ స్కాన్‌ తీయించుకోవాలి. కోవిడ్‌ ఏ స్టేజిలో ఉందో నిర్ధారణ చేసుకోవాలి. లక్షణాలు ఉన్నా.. ఎవరు కూడా బయట తిరగవద్దు. ఇతరులకు అంటించవద్దు అని పేర్కొన్నారు. కొన్ని సార్లు భయం కూడా మనిషి చావుకు కారణం కావచ్చు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కంగారు పడటం కూడా దీనికి కారణమవుతుంది.

కాగా, సోమవారం రెంజల్‌ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్‌ అనే వ్యక్తి కరోనా పరీక్షలకు అని రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. ఆయనతో పాటు తల్లి, ఆయన భార్య, తమ్ముడు కూడా వచ్చారు. అయితే పీహెచ్‌కి వచ్చిన ఆయన పరీక్షలు చేయించుకుని చెట్టు కింద సేద తీరాడు. ఇక కరోనా రిపోర్టు రాకముందే టెన్షన్‌కు గురైన అశోక్‌.. తల్లి ఒడిలోనే మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన అందరిని కలచి వేసింది.

ఇవీ చదవండి:

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.. ఎన్ని నిండి ఉన్నాయి.. పూర్తి వివరాలు

పిల్లలపై పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. పిల్లల్లో కరోనా లక్షణాలు ఏంటి.. వైద్యులేమంటున్నారు..?

కరోనా పరీక్షల్లో నెగెటివ్‌.. కన్నతల్లి ఒడిలోనే కన్నుమూసిన కొడుకు.. గుండెలను పిండెస్తున్న హృదయ విదారక ఘటన

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!