Road Accident: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం..

Suryapet Road Accident: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే

Road Accident: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం..
Road Accident

Suryapet Road Accident: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలోని మునగాలలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు మునగాల వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో ఇద్దరు యువకులు కూడా తీవ్రంగా గాయపడి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పలు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా.. ఇద్దరు యువకులు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జాతీయ రహదారిపై ఈ సంఘటన జరగడంతో ట్రాఫిక్‌కు కొంచెం అంతరాయం ఏర్పడింది.

ఇదిలాఉంటే.. సోమవారం ఉదయం నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి – అద్దంకి రహదారిపై వల్లభాచెరువు వద్ద కారు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను చెర్లపల్లికి చెందిన గుండెమల్ల శ్రీకాంత్‌, జెర్రిపోతుల వెంకటేశ్వర గౌడ్‌గా గుర్తించారు.

Also Read:

Karnataka Lockdown: యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం.. కర్ణాటకలో 14 రోజులపాటు లాక్‌డౌన్

Oxygen Shortage: ఆక్సిజన్ కొరత.. థానేలో ఆరుగురు కరోనా రోగుల మత్యువాత

Lock-down Ahead: మరోసారి కఠినంగా లాక్‌డౌన్? సన్నాహాల్లో కేంద్ర ప్రభుత్వం!