Lock-down Ahead: మరోసారి కఠినంగా లాక్‌డౌన్? సన్నాహాల్లో కేంద్ర ప్రభుత్వం!

లాక్ డౌన్ దిశగా  మన దేశం మరోసారి పయనిస్తోంది. ఆర్థిక పరిస్థితా లేక ప్రజల ప్రాణాలా అంటే ప్రజారోగ్యానికేపెద్ద పీట వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోొంది.

Lock-down Ahead: మరోసారి కఠినంగా లాక్‌డౌన్? సన్నాహాల్లో కేంద్ర ప్రభుత్వం!
Lockdown
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 26, 2021 | 4:09 PM

Lock-down Ahead across the country again: లాక్ డౌన్ దిశగా  మన దేశం మరోసారి పయనిస్తోంది. ఆర్థిక పరిస్థితా లేక ప్రజల ప్రాణాలా అంటే ప్రజారోగ్యానికేపెద్ద పీట వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. దేశంలో వున్న విభిన్నమైన రాజకీయ పరిస్థితి కారణంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే సెకెండ్ వేవ్ కరోనా ఎఫెక్ట్ (SECOND WAVE CORONA EFFECT) దారుణంగా వున్న తరుణంలో సంక్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కేంద్ర, రాష్ట్రాల నెత్తిన పడుతోంది.

దేశంలో 2020 జనవరి 31న తొలి కరోనా వైరస్ (CORONAVIRUS) పాజిటివ్ కేసు నమోదైంది. ఆ తర్వాత రెండు నెలల పాలు దేశంలో కరోనా ప్రభావం పెద్దగా లేదు అన్న ఫీలింగ్ కలిగింది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్చి (2020) చివరి వారం నుంచి దేశంలో కరోనా పాండమిక్ పరిస్థితి (CORONA PANDEMIC SITUATION) పేరిట లాక్ డౌన్ విధించింది. ముందుగా వారం రోజులు అన్న లాక్‌ డౌన్ ఆ తర్వాత పలు విడతల పొడిగింపుతో మే నెల రెండో వారం దాకా కొనసాగింది. మే రెండో వారం తర్వాత కేంద్ర ప్రభుత్వం మెల్లిగా లాక్ డౌన్‌కు సడలింపులు ఇవ్వడం ప్రారంభించింది. అయితే.. 2020 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దేశంలో కరోనా విజృంభణ కట్టడిలోనే వున్నా ఎప్పుడైతే లాక్ డౌన్‌కు సడలింపులు మొదలయ్యాయో.. అప్పట్నించి కరోనా పాజిటివ్ కేసుల (CORONA POSITIVE CASES) సంఖ్య పెరగడం మొదలైంది.

ఫలితంగా 2020 జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2020 సెప్టెంబర్ 19న దేశంలో అత్యధికంగా ఒకేరోజున 97వేల కరోనా పాజటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత దేశంలోకరోనా ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి 2021 నాటికి దేశంలో కరోనా ప్రభావం మినిమైజ్ అయ్యిందని అందరు భావించారు. అదే సమయంలో జనవరిలోనే కరోనా వైరస్‌కు విరుగుడుగా రెండు వ్యాక్సిన్లు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందాయి. సీరం సంస్థ తయారు చేసిన కోవీషీల్డు, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ టీకాలు వినియోగంలోకి వచ్చాయి. ముందుగా కరోనా నియంత్రణా పోరాటంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా వున్న ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టారు.

మార్చి 1వ తేదీ నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు 60 ఏళ్ళు పైబడిన అందరు పౌరులకు, 45 ఏళ్ళు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. ఇది ఒకవైపు జరుగుతుండగానే దేశంలో ప్రజలకు కరోనా అంటే భయం తొలగి పోయింది. ఎలాగో వ్యాక్సిన్ వచ్చేసింది అని.. ఒకవేళ వైరస్ సోకినా ప్రాణాలకు ప్రమాదం లేదనే నిర్లక్ష్యం ప్రజల్లో మొదలైంది. దానికి తోడు విమాన, రైలు, రోడ్డు రవాణా జోరందుకుంది. విదేశాల నుంచి రాకపోకలు పెరిగిపోయాయి. ఫలితంగా దేశంలోకి యుకే వేరియంట్ వైరస్ ఎంటరైంది. దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ కూడా జత చేరింది. తొలుత యుకే వేరియంట్ పంజాబ్ రాష్ట్రంలో కనిపించగా.. దక్షిణాఫ్రికా వేరియంట్ కర్నాటకలో నమోదైంది. మ్యూటెంట్ అయిన కరోనా వైరస్ దేశంలోకి ఎంటరవడం, ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోవడంతో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలో దారుణమైన పరిస్థితులను తీసుకువచ్చింది.

ప్రస్తుతం దేశంలో ప్రతి రోజూ మూడు లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం (ఏప్రిల్ 26న) దేశంలో ఏకంగా 3 లక్షల 52 వేలకు పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల పరంగా చూస్తే.. దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పాపం కచ్చితంగా మహారాష్ట్రదే అనిచెప్పాలి. మహారాష్ట్రతోపాటు.. చత్తీస్ గఢ్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సెకెండ్ వేవ్ నెంబర్స్ ఆరోగ్య విపత్తును సూచిస్తున్నాయి. గమ్మత్తేంటంటే కరోనా సెకెండ్ వేవ్ నెంబర్స్ దారుణమైన పరిణామాలను సూచిస్తుంటే.. ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి మారడం లేదు. ప్రభుత్వాలు సైతం లాక్ డౌన్‌తో దెబ్బతినే ఆర్థిక రంగాన్నే దృష్టిలో పెట్టుకుంటున్నాయి. ప్రజారోగ్యం కంటే ఆర్థిక పరిస్థితే ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. అందుకే కేంద్ర రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించేందుకు వెనుకంజ వేస్తున్నాయి. ఫలితంగా మేటర్ కోర్టులకు ఎక్కుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు నిర్దిష్టమైన హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. అయితే.. దీని ప్రభావం కరోనా విస్తృతిపై పెద్దగా కనిపించడం లేదు. రాత్రి పూట కర్ఫ్యూ తర్వాత కూడా రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గడం లేదు సరికదా పెరుగుతూనే వుంది.

దాదాపు ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా వుందనే చెప్పాలి. కొన్ని రాష్ట్రాలలో పాక్షిక, మరికొన్ని రాష్ట్రాలలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం  సోమవారం (ఏప్రిల్ 26న) రాష్ట్రాలకు కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న షాపింగ్ కాంప్లెక్సులు (SHOPPING COMPLEXES), సినిమా థియేటర్లు (CINEMA THEATRES), బార్లు (BARS), రెస్టారెంట్లు (RESTAURANTS), ఫంక్షన్ హాళ్ళు (FUNCTION HALLS), ఈవెంట్ ఆర్గనైజింగ్స్ (EVENT ORGANIZING) వంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిర్దేశించింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పరిశీలిస్తే దేశం మరోసారి లాక్ డౌన్ దిశగా వెళుతున్నట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం కేవలం మూడు గంటల వ్యవధిలో దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించడంపై పలు పార్టీలు రాజకీయం చేశాయి. ఈ క్రమంలో రాజకీయ విమర్శలను కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (NARENDRA MODI GOVERNMENT) పరిగణలోకి తీసుకునే పరిస్థితి గోచరిస్తోంది. తాజాగా జాతీయ మీడియా సంస్థల (NATIONAL MEDIA ORGANIZATIONS) సమాచారాన్ని పరిశీలిస్తే మే రెండో తేదీ నాటికి దేశంలో కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలివిడతగా వారం, పది రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ విధింపునకు మోదీ ప్రభుత్వం సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ముందుగా 50 శాతం ఆక్యుపెన్సీతో పనిచేసేలా చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యే సంకేతాలున్నాయి. ఏది ఏమైనా దేశం మరోసారి లాక్‌డౌన్ పరిస్థితిలోకి పడే సంకేతాలే అధికంగా వున్నాయి. ఈ పరిస్థితి నివారణకు కరోనా నిబంధనలను పాటించడంతోపాటు వ్యాక్సిన్ వేయించుకోవడమే సరైన మార్గమని వైద్య వర్గాలంటున్నాయి. మాస్కులు ధరించడం (WEARING MASKS) (వీలైతే డబుల్ మాస్కులు (DOUBLE MASKS)), శానిటైజర్లు (SANITIZERS) విరివిగా వాడడం, సామాజిక దూరాన్ని (SOCIAL DISTANCE) పాటించడం ద్వారా కరోనా సెకెండ్ వేవ్‌ను కట్టడి చేద్దామని వైద్య, సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.