Andhra Round Up 2024: : మలుపుతిప్పిన ఘటనలు.. మరిచిపోలేని సంఘటనలు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనల్లో ఈ ఏడాది బాగా గుర్తుండిపోయిన సంచలనాత్మక అంశం ఏది అని అడిగితే ఏం చెబుతారు..! మైండ్‌లో ఓ సీన్ గుర్తొస్తోంది కదూ..! పొలిటికల్‌గా ఆలోచిస్తే.. ఓ ఘన విజయం, ఓ ఘోర పరాజయం. పొలిటికల్ తెరపై ఓ కొత్త స్టార్ ఆవిర్భావం, అన్నపైకే తిరిగిన ఓ బాణం. బెజవాడలో వరదలు, జత్వానీ కేసు సహా పలువురు వైసీపీ నేతలకు నోటీసులు, అరెస్టులు. ఇక తిరుమల లడ్డూ వివాదం.. దువ్వాడ-దివ్వెల వ్యవహారం. ఇలా.. 2024లో జరిగిన ఒక్కో సంఘటనను మరోసారి గుర్తు చేసుకుందాం..

జనరల్‌గా 2024లో ఏపీ పాలిటిక్స్‌లో జరిగిన మార్పుల గురించి చెప్పుకోవాలంటే.. జనవరి నుంచి చెప్పుకోవాల్సిన పని లేదు. 2024 జూన్ 4. ఆ ఒక్క రోజు గురించి చెప్పుకుంటే చాలు. హైఓల్టేజ్‌తో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఒక ప్రభంజనమే సృష్టించింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 175 స్థానాల్లో 164 సీట్లను గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేసి 135 సీట్లు గెలిచింది. జనసేన పార్టీ 21 సీట్లలో పోటీ చేసి అన్ని సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 10 సీట్లలో పోటీ చేసి 8 సీట్లలో గెలిచింది. వైసీపీ మాత్రం 11 సీట్లకు పరిమితం అయింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అలాంటి విజయం బహుశా నభూతో నభవిష్యత్. వన్‌సైడ్ లవ్ టూసైడ్స్ అయింది. ఆ ఇద్దరి మధ్య ప్రేమను అంగీకరిస్తూ మరో సైడ్ బీజేపీ నిలబడింది. ఈ మూడు పార్టీల కూటమి గురించి ఎన్నో ఊహాగానాలు వచ్చినా.. ఫిబ్రవరి వరకు తేలనేలేదు. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు కూటమి ఏర్పాటే జరగలేదు. ఇంకోవైపు వైసీపీ దూసుకెళ్తోంది. ఫేజ్-1, 2, 3 అంటూ ఫటాఫట్‌గా సీట్లు ప్రకటించేసి ప్రచారానికి కూడా వెళ్లింది. అక్కడ చూస్తేనేమో టీడీపీ-జనసేన-బీజేపీ పట్ల సీట్ల పంపకాలే పూర్తికాలేదు. ఆలస్యం అమృతం అవుతుంది కూడా. బహుశా అదే జరిగి ఉంటుంది. కూటమి కట్టారు ఎన్నికలకు వెళ్లారు.. ఓ ప్రభంజనమే సృష్టించారు. కుప్పం...