క్యూట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో చిచ్చు పెడుతున్న భాను శ్రీ

Phani CH

30 December 2024

భానుశ్రీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు తెలుగు బిగ్ బాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

భానుశ్రీ హైదరాబాద్ లో పుట్టి పెరిగింది.. ఈ చిన్నదానికి స్వప్న అని మరొక పేరు కూడా ఉంది.. చిన్నప్పటి నుంచీ యాక్టింగ్‌నే తన కెరీర్‌గా ఎంచుకుంది.

జాబిలమ్మ సీరియల్‌తో బుల్లితెరపై సందడి చేసిన ఈ బ్యూటీ... వాణీ రాణి, గోల్డ్ రష్, టాలీవుడ్ స్క్వేర్స్ వంటి వాటిలోనూ నటించింది.

2017లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన భానుశ్రీ... ఇద్దరి మధ్యా 18 సినిమాలో నటించింది. ఆ తర్వాత మర్ల పులి, కుమారి 21F, బాహుబలి, కాటమరాయుడు వంటి సినిమాల్లో నటించింది.

తెలుగు బిగ్ బాస్ షో లో తనదైన శైలి ఆటతో బుల్లితెరపై కూడా తన సత్తా చాటి తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన క్యూట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటుంది భాను శ్రీ.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్  క్రేజీ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.