చికెన్ బోన్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే..
చికెన్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎందుకంటే..చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. రోజుకో చికెన్ పీస్‌కానీ, గ్రేవి గానీ, లేదంటే... చివరకు చిన్న బొక్క దొరికినా తృప్తిపడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. చికెన్ బోన్స్‌లో ఉండే మూలగను కూడా కొందరు ఇష్టంగా తింటుంటారు. కానీ,ఇది సరైనదేనా..? చికెన్ బోన్స్ తినటం మంచిదేనా..? అనే విషయాలపై ఆరోగ్య నిపుణులు చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగానే మన ఇళ్లలో పెద్దలు తరచూ చెబుతుంటారు..చికెన్ బోన్స్ తినడం మంచిది కాదు అని. కానీ చికెన్ బోన్స్ తినడం మంచిదే అంటున్నారు నిపుణులు.. కానీ, అది బ్రాయిలర్ చికెన్ బోన్స్ కాదంటున్నారు. నాటు కోడి బోన్స్ తినటం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. నాటుకోడి బోన్ మజ్జలో కొల్లాజన్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్, గ్లైసిన్, గ్లూకోసమైన్ తో సహా అనేక ప్రోత్సాహకసమ్మేళనాలు ఉంటాయని చెబుతున్నారు. ఇవి మనలో వాపులు, నొప్పులు తగ్గిస్తాయి. మన చర్మ ఆరోగ్యానికి, కీళ్ల పనితీరుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.
చికెన్ బోన్స్ మూలుగ లో ఖనిజాలు జింక్, ఐరన్, కాల్షియం మరియు సెలీనియం ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన పోషకాలు ఇస్తాయి. చికెన్ బోన్స్ లో విటమిన్లు A,B, విటమిన్లు B1, B5, B7 కూడా ఉన్నాయి. ఇవి జీవక్రియ, శక్తి మార్పిడికి సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే గ్లైసిన్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. నాటుకోడికి చెందిన బోన్, బోన్ మారో తినడం మంచిదేనని ఇందులో మంచి పోషకాలు మన శరీరానికి ఎంతగానో దోహదం చేస్తాయని చెబుతున్నారు.
అయితే బ్రాయిలర్ చికెన్ కు ఇచ్చే ఇంజక్షన్ల కారణంగా వాటి బోన్స్ తినడం మంచిది కాదని చెబుతారు. బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరగడం కోసం వాటికి ఇంజక్షన్లు చేస్తారు. ఆ ఇంజక్షన్ల ప్రభావం కోళ్ల బోన్స్ పైన ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి కోళ్ల ఎముకతో పాటు అందులో ఉండే మూలగ పైన కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే బ్రాయిలర్ కోళ్లకు చెందిన ఎముకలను తింటే అనారోగ్యమని చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..