రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టటం లేదా? పడుకునే ముందు ఈ జ్యూస్ తప్పనిసరిగా ట్రై చేయండి..!

లేదంటే, నిద్రలేమితో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని రకాల పండ్లు, జ్యూస్‌లు చక్కటి పరిష్కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో చెర్రీ పండ్లు అతి ముఖ్యమైనవి. నిద్ర లేమి సమస్యలున్న వారికి చెర్రీ పండ్లు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు.

రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టటం లేదా? పడుకునే ముందు ఈ జ్యూస్ తప్పనిసరిగా ట్రై చేయండి..!
Cherry Juice
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 30, 2024 | 8:06 PM

నేటి ఆధునిక కాలం, బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా చాలా మంది అధిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రతి వ్యక్తికి రోజుకు 6 నుంచి 7 గంటల నిద్ర తప్పనిసరి అంటున్నారు వైద్యులు. ప్రశాంతంగా సరిపడా నిద్రపోయినప్పుడే శరీరానికి తగినంత విశ్రాంతి లభించి జీవక్రియ సక్రమంగా జరిగి ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే, నిద్రలేమితో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని రకాల పండ్లు, జ్యూస్‌లు చక్కటి పరిష్కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో చెర్రీ పండ్లు అతి ముఖ్యమైనవి. నిద్ర లేమి సమస్యలున్న వారికి చెర్రీ పండ్లు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు.

తగిన మోతాదులో రెగ్యులర్‌గా చెర్రీ జ్యూస్‌ను నిద్రపోయేందుకు రెండు గంటలకు ముందు తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందట. దీనివల్ల ఆరోగ్యంపై మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు. ఎందుకంటే చెర్రీలలో ఉండే మెలటోనిన్ కంటెంట్ కారణంగా.. చెర్రీ జ్యూస్ మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. మెలటోనిన్‌ను సాధారణంగా ‘స్లీప్ హార్మోన్’ అని పిలుస్తారు. ఇది మనం ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు నిద్ర లేవాలో నిర్ణయించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చెర్రీ పండ్లు, వీటితో చేసిన జ్యూస్‌లో ఉండే ట్రిప్టోఫాన్, మెలటోనిన్ సమ్మేళనాలు కూడా నిద్రపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. సిర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించడం ద్వారా ఇది శరీర సహజ నిద్ర ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. కాబట్టి పడుకోవడానికి రెండు గంటల ముందు చెర్నీ జ్యూస్ తీసుకుని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని అంటున్నారు. రాత్రి సమయంలో దీని రెగ్యులర్ వినియోగం కొద్ది రోజుల్లోనే సమర్థవంతమైన ఫలితాలను అందిస్తుంది. రాత్రిపూట మీకు మెరుగైన ప్రశాంత నిద్ర కోసం రోజూ గ్లాసు చెర్రీ జ్యూస్ తాగడం ఎంతో మేలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..