- Telugu News Photo Gallery Know The Health Benefits For Consuming Black Pepper Regularly In Telugu Lifestyle News
Black Pepper: ఈ బ్లాక్‌గోల్డ్‌ని రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..? ఇలాంటి అనారోగ్యాలు పరార్..!
మిరియాలను ‘బ్లాక్‌గోల్డ్’అని కూడా పిలుస్తారు. మిరియాలను మన రోజూవారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక వీటితో లాభాలు తెలిస్తే..
Updated on: Dec 30, 2024 | 7:39 PM

బరువు తగ్గాలనుకునేవారు మిరియాలను తినవచ్చు. నల్ల మిరియాలు తినడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు, తలపై ఫంగస్ నివారిస్తుంది. యాంటీ బాక్టీరియల్ గుణాలున్న మిరియాలు చర్మ ఆరోగ్యానికి మంచివి. మహిళల్లో సాధారణ సమస్య అయిన బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది.

ముఖ్యంగా మిరియాలలో పెపరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు. మిరియాలు తీసుకోవడం వల్ల విటమిన్లు B, C, సెలీనియం, బీటా-కెరోటిన్ వంటి అవసరమైన పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.

నల్ల మిరియాలు శరీర కొవ్వును కరిగించి క్యాన్సర్‌తో కూడా పోరాడుతాయి. విటమిన్ సి ఉన్న మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జలుబు, దగ్గు, ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. ఫైబర్ ఉన్న మిరియాలను తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం తగ్గుతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Black Pepper

నల్లమిరియాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. డిప్రెషన్‌ను దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నల్ల మిరియాలలోని పెపరిన్ అనే రసాయనం ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి.




