వాట్ యాన్ ఐడియా మేడమ్ జీ ! భారీ క్యూలైన్‌ను తప్పించుకునేందుకు భలే ప్లాన్ చేశారే…
అలా ఆమె తనకు నచ్చిన ఫుడ్ పార్శిల్ తీసుకుని ఏంచక్కా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇదంతా గమనించిన స్థానికులు సదరు మహిళ చేసిన పనికి ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు. భలే ఐడియా అనుకున్నారు. తమ ఫోన్లు బయటకు తీశారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌తో నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరులోని సీటీఆర్ రెస్టారెంట్ అంటే చాలా ఫేమస్. అక్కడ ఫుడ్ తినాలంటే గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి ఉండాల్సి ఉంటుంది. కూర్చుని తినేందుకు సీట్లు మాత్రమే కాదు..పార్శిల్ కోసం కూడా క్యూ కట్టాల్సిందే. అందుకే సీటీఆర్ హోటల్‌కి వెళ్లిన ఓ మహిళ.. అక్కడ క్యూ లైన్ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నది. కానీ, నిరాశపడలేదు. స్మార్ట్ ఆలోచించింది.. నిలబడి ఉన్న చోటే.. నిమిషాల్లో తనకు కావాల్సిన ఫుడ్ తన దగ్గరకు వచ్చేలా చేసింది. అది తెలిస్తే.. మీరు ఖచ్చితంగా నోరెళ్ల బెడతారు..
బెంగుళూరులోని ఐకానిక్ CTR హోటల్‌లో తనకు ఇష్టమైన వంటకం రుచి చూసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడకుండా ఓ మహిళ చేసిన ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. హోటల్‌లో ఉన్న క్యూలైన్ చూసిన ఆమె.. అదే హోటల్ ముందు ఆగి, అక్కడే జొమాటో నుండి బటర్ దోసను ఆర్డర్‌పెట్టింది. హోటల్ ఎదురుగానే ఉంది.. కాబట్టి డెలివరీ బాయ్ కూడా నిమిషాల్లో ఆర్డర్ అందించాడు. అలా ఆమె తనకు నచ్చిన ఫుడ్ పార్శిల్ తీసుకుని ఏంచక్కా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇదంతా గమనించిన స్థానికులు సదరు మహిళ చేసిన పనికి ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు. భలే ఐడియా అనుకున్నారు. తమ ఫోన్లు బయటకు తీశారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌తో నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Yesterday we had a @peakbengaluru moment:
– The queue was too long at CTR and we would be late for our #UiTheMovie if we had waited in the line.
– Opened Zomato, ordered BeNNe masale dosae and Kharabath to a location just outside CTR to minimise inconvenience to the driver
— Anubha (@artbyahbuna) December 26, 2024
CTR హోటల్‌లో ఆన్ లైన్ ఆర్డర్స్ కోసం స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశారు. డెలివరీ బాయ్స్ అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. అందుకే త్వరగా అయిపోతుంది. కానీ డైన్ ఇన్ కానీ.. స్వయంగా పార్శిల్ తీసుకెళ్లాలన్నా లేట్ అవుతుంది. దీంతో హోటల్ ముందు నిలబడి ఉండగానే ఆర్డర్ పెట్టించుకుని గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడ ఉండాల్సిన అవసరం లేకుండా చేసుకుంది. ఇక తన అనుభవాన్ని ఆ యువతి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి