సీమ వంకాయలోని పోషకాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనిని ఆహారంలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.