- Telugu News Photo Gallery Cinema photos What are the blockbuster combinations that will be repeat again in 2025?
Repeat Combinations: 2025లో బ్లాక్ బస్టర్ కాంబోస్ రిపీట్.. ఏంటా సినిమాలు.?
రిపీట్ కాంబినేషన్స్‌కు ఇండస్ట్రీలో ఎప్పుడూ ఓ విధమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంటే అదోరకం క్రేజ్ అంతే. 2025లో ఇలాంటి కాంబోలు చాలా వరకు రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అందులో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్స్ ఐదు ఉన్నాయి. మరింతకీ ఏంటా కాంబోస్..?
Updated on: Dec 30, 2024 | 3:59 PM

2025.. ఇయర్ ఆఫ్ రిపీట్ కాంబినేషన్స్‌గా మారబోతుంది. తెలుగులోనే ఇలాంటి రిపీట్ కాంబోస్ కనిపించబోతున్నాయి. అందులో రామ్ చరణ్, సుకుమార్ గురించి చెప్పుకోవాలి. పుష్ప 2తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన లెక్కల మాస్టారు.. ఆల్రెడీ పాన్ ఇండియన్ స్టార్ అయిన చరణ్‌తో రంగస్థలం తర్వాత చేయబోతున్న సినిమా ఇది.

రామ్ చరణ్, సుకుమార్ సినిమా 2025 సెకండాఫ్‌లో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో నాలుగో సినిమా రాబోతుంది. అదే అఖండ 2.. ఈ మధ్యే షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 25, 2025న దసరా కానుకగా రానుంది అఖండ 2.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సైతం నాలుగోసారి కలిసి పని చేయబోతున్నారు. ఈ కాంబోలో భారీ పాన్ ఇండియన్ మైథలాజికల్ సినిమా రాబోతుంది. దీని బడ్జెట్ 400 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

అలాగే పూరీ జగన్నాథ్, గోపీచంద్ కాంబో కూడా 2025లో రిపీట్ కానుందని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరూ గోలీమార్ సినిమాకు పని చేసారు. మొత్తానికి 2025లో చాలా కాంబోస్ రిపీట్ కానున్నాయి.

వీటితో పాటు చందు మొండేటి, హీరో నిఖిల్ కాంబోలో రానున్న కార్తికేయ 3 కూడా 2025లో మొదలుపెట్టి అవకాశాలు కనిపిస్తుంది. దీని ముందు వచ్చిన కార్తికేయ 1, కార్తికేయ 2 బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.




