- Telugu News Photo Gallery Cinema photos Mega fans confusion on Chiranjeevi vishwambhara movie release date, details here
Vishwambhara: మెగాస్టార్ సినిమాపై ‘చిరు’ సందేహం.! కన్ఫ్యూషన్ లో అభిమానులు..
సంక్రాంతి రేసు నుంచి విశ్వంభర తప్పుకుని చాలా రోజులైపోయింది. దానికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు వశిష్ట.అన్నీ బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం అభిమానులకు క్లారిటీ ఇవ్వడమే మరిచిపోయారు మేకర్స్. అదే రిలీజ్ డేట్..! అసలింతకీ విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు.? వాల్తేరు వీరయ్య తర్వాత మళ్లీ ట్రాక్ తప్పారు చిరంజీవి.
Updated on: Dec 30, 2024 | 3:40 PM

సంక్రాంతి రేసు నుంచి విశ్వంభర తప్పుకుని చాలా రోజులైపోయింది. దానికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు వశిష్ట.

అన్నీ బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం అభిమానులకు క్లారిటీ ఇవ్వడమే మరిచిపోయారు మేకర్స్. అదే రిలీజ్ డేట్..! అసలింతకీ విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు.?

వాల్తేరు వీరయ్య తర్వాత మళ్లీ ట్రాక్ తప్పారు చిరంజీవి. భోళా శంకర్ సినిమా అసలు వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు.

అసలు ఈ సినిమా ఎందుకు చేసాడ్రా బాబూ అంటూ మెగా ఫ్యాన్స్ తెగ ఫీలైపోయారు. ఆ షాక్ నుంచి బయటపడటానికే ఫ్యాన్స్‌కు చాలా రోజులు పట్టింది.

ప్రస్తుతం చిరుతో పాటు అభిమానుల ఆశలు విశ్వంభరపైనే ఉన్నాయి. బింబిసారతో చేసిన మ్యాజిక్కే చిరంజీవితోనూ చేయాలని చూస్తున్నారు వశిష్ట.

పూర్తిగా విజువల్ వండర్‌ను ఆడియన్స్‌కు చూపించాలని కష్టపడుతున్నారు. అయితే టీజర్‌లోని విజువల్స్‌కు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో దీనిపై మళ్లీ రీ వర్క్ మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే సంక్రాంతి నుంచి సినిమాను వాయిదా వేసారు కూడా. విశ్వంభర కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.

మే 9న విశ్వంభర వస్తుందని ప్రచారం జరుగుతున్నా.. దానికి ముందే ఏదైనా రిలీజ్ డేట్ ఖాళీ అయితే అది తీసుకోవాలని చూస్తున్నారు చిరు. ఎప్రిల్ 10న రాజా సాబ్, 18న తేజ సజ్జా మిరాయ్‌లలో ఒకటి కచ్చితంగా వాయిదా పడనుందని.. ఆ డేట్‌కే విశ్వంభర రానుందని తెలుస్తుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?




