- Telugu News Photo Gallery Business photos Most powerful and best mileage cars available for less than rs 7 lakh maruti suzuki swift, tata tiago, renault kwid
Best Mileage Car: ఈ 5 కార్లు రూ.7 లక్షల కంటే తక్కువ ధరల్లో.. 25 కి.మీ మైలేజీ!
Best Mileage Car: కారు కొనుగోలు చేసేటప్పుడు ప్రధాన దృష్టి దాని మైలేజీపై ఉంటుంది. మీరు ప్రయాణీకులైనా లేదా నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల గుండా వెళ్లాల్సి వచ్చినా, మైలేజీ ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. మంచి మైలేజీ ఉన్న కారు ఖర్చు కొంత తక్కువగానే ఉంది. అలాగే ప్రయాణంలో పదే పదే ఆలోచించాల్సిన అవసరం లేదు. 7 లక్షల కంటే తక్కువ ధరకు లభించే ఐదు శక్తివంతమైన కార్ల గురించి తెలుసుకుందాం..
Updated on: Dec 30, 2024 | 3:02 PM

మారుతి సుజుకి స్విఫ్ట్: మారుతి సుజుకి మైలేజ్ పరంగా చాలా మంచి కారు. కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దీని మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ 24.8 Kmpl మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ మోడల్ 25.75 Kmpl మైలేజీని ఇస్తుంది. ఇది 1.2-లీటర్ మూడు-సిలిండర్ Z సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 5700 rpm వద్ద 80.4 bhp, 4300 rpm వద్ద 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా టియాగో: టాటా టియాగో ధర రూ. 5 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 6 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నివేదికల ప్రకారం, మాన్యువల్ వేరియంట్ 20.09 Kmpl మైలేజీని ఇస్తుంది. అలాగే ఆటోమేటిక్ వేరియంట్ 19 Kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో 1.2-లీటర్ ఇంజన్ ఉంది. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 84.8 బిహెచ్‌పి, 3300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రెనాల్ట్ క్విడ్: రెనాల్ట్ క్విడ్ ధర రూ. 4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతోంది. ఇందులో 6 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనంలో 1.0-లీటర్ ఇంజన్ కలదు. దీని ఆటోమేటిక్ వేరియంట్ 22.3 Kmpl మైలేజీని ఇస్తుంది. మాన్యువల్ వేరియంట్ 21.46 Kmpl మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ నాలుగు వేరియంట్లు, 9 కలర్స్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 5.54 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ARAI నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి వ్యాగన్ R మాన్యువల్ వేరియంట్ 23.56 Kmpl మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ 24.43 Kmpl మైలేజీని ఇస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్: 12 కలర్ ఆప్షన్‌లు హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 1.2-లీటర్ కప్పా ఇంజన్ కలదు. మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 19.4 Kmpl మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ 19.2 Kmpl మైలేజీని ఇస్తుంది.




