- Telugu News Photo Gallery Business photos Tax Free Countries 2024 Full List No Income Tax Tax Free Country
Tax Free Country: ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా పన్ను వసూలు చేయని దేశాలు ఏవో తెలుసా?
Income Tax: దేశాలకు ఎక్కువ ఆదాయం వచ్చేది ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి. వివిధ పన్నుల ద్వారా వచ్చే డబ్బు ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఎలాంటి ఆదాయాలపై కూడా అక్కడి ప్రభుత్వాలకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు..
Updated on: Dec 30, 2024 | 3:58 PM

పన్ను చెల్లించాల్సిన అవసరం లేని దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అంటే మీరు సంపాదించిన ప్రతిదానిపై మీ ప్రభుత్వం పన్ను విధించదు. కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ దేశాల్లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రజలు పన్నులు కట్టకపోతే దేశం ఎలా నడుస్తుందన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ దేశాల గురించి, వాటి ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ దేశాలు ఆదాయం కోసం పర్యాటకానికి భారీగా మద్దతు ఇస్తున్నాయి. ఈ దేశాల నుండి పర్యాటకులు తిరిగి వచ్చినప్పుడు, వారికి రిటర్న్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు.

2024 సంవత్సరానికి సంబంధించి టాప్ ట్యాక్స్ ఫ్రీ దేశాల జాబితా విడుదలైంది. ఈ దేశాల్లోని ప్రజలు దాదాపు తమ కష్టార్జిత డబ్బును ఉంచుకుని పన్ను రహిత జీవితాన్ని గడపవచ్చని అందులో పేర్కొన్నారు.

నివేదికల ప్రకారం.. ఈ 9 దేశాల్లో మీ ఆదాయాలపై పన్ను విధించరు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహమాస్, ఖతార్, వనాటు, బహ్రెయిన్, సోమాలియా, బ్రూనై, బహ్రెయిన్ ఈ జాబితాలో పేర్లు ఉన్నాయి. పన్ను విధింపు నిర్ణయం చాలా కష్టం. ప్రభుత్వాలు తమ ఆర్థిక అవసరాలు, ఆర్థిక సిద్ధాంతాల ఆధారంగా ఈ వ్యవస్థను అమలు చేస్తాయి.

పెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలు తమ పౌరులపై నేరుగా పన్ను విధించకుండా ఉండగలవు. ఈ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకోవడానికి చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలపై ఆధారపడి ఉండవచ్చు.




