AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Astrology: ఆ రాశులకు చెందిన మహిళలకు అధికారం, ఆదాయం!

స్త్రీ గ్రహం, మహిళా పక్షపాతి అయిన శుక్రుడు ఈ నెల 26న మేష రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల మహిళల ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులు చదువులు, ఉద్యోగాలు, అధికారం, ఆదాయం వంటి విషయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 19 వరకు వీరికి ఏదో ఒక శుభ యోగం పడుతూనే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆర్థికంగా కూడా అందలాలు ఎక్కే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారు శుభ యోగాలను అనుభవించడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 7:12 PM

Share
మేషం: ఈ రాశికి ధన, సప్తమాధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు ఆదాయ వృద్ధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. మహిళలకు షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడుల ద్వారా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. విద్యార్థినులు విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.

1 / 6
మిథునం: ఈ రాశికి శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు కొద్ది ప్రయత్నంతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా బాగా రాణించడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. విద్యార్థినులు రికార్డులు సృష్టిస్తారు. మహిళలు పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. గృహిణులకు సంతాన యోగం పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి మహిళలకు ఆర్థికంగానే కాక, కెరీర్ పరంగా కూడా శీఘ్ర పురోగతి ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల్లో ఉన్నవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థినులు ఘన విజయాలు సాధిస్తారు. గృహిణుల కుటుంబ, దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది.

3 / 6
సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో దశమాధిపతి శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఒక ప్రముఖురాలిగా గుర్తింపు లభిస్తుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.  వృత్తి, ఉద్యోగాల్లో వీరి సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఏ రంగంలో ఉన్నా పురోగతితో పాటు, గుర్తింపు కూడా లభిస్తుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి కుదురుతుంది.

4 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. పేరు ప్రతిష్ఠలు, పలుకుబడి బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి జీవితంలో రికార్డులు సృష్టిస్తారు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.  ఏ ప్రయత్నం చేపట్టినా బాగా కలిసి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల దిగ్బల రాజయోగం పట్టే అవకాశం ఉంది. మహిళలకు విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉన్నతోద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి జీవితంలో ఊహించని గుర్తింపు లభిస్తుంది. ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

6 / 6
Follow Us