Watch: మనాలిలో మంచు బీభత్సం.. కళ్లముందే జారీ లోయలోపడ్డ ట్రక్కు.. డ్రైవర్ ఎలా తప్పించుకున్నాడో చూస్తే..
హిమపాతంలో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఈ వాహనం ఎలా జారి కాలువలో పడిపోయిందో చూస్తే నిజంగానే గుండె జారిపోయినట్టుగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో మనాలి పర్యటనను కొద్ది రోజులు వాయిదా వేసుకోవటం మంచిది అంటూ పర్యాటకులకు పలు సూచనలు చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం చలి విపరీతంగా ఉంది. మనాలిలో అయితే భారీగా మంచు కురుస్తుండటంతో..ఉష్ణోగ్రత మైనస్‌లోకి పడిపోయింది. మరోవైపు హిమపాతాన్ని ఆస్వాదించడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. హిమపాతం కారణంగా స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చింది. కొన్ని గంటలపాటు మంచులో వాహనాలు నిలిచిపోయాయి. ప్రజల భద్రత కూడా ముప్పుగా మారింది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్‌గా మారిన ఈ వీడియో మనాలిలో జరిగిన సంఘటనగా తెలిసింది. భారీ హిమపాతంలో డ్రైవింగ్ ప్రమాదకరంగా మారింది. ఇక్కడ కూడా ఓ వాహనం ప్రమాదానికి గురైంది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో అతడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మంచుతో నిండిపోయిన రహదారిపై ట్రక్కు జారిపోవటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రక్కు అదుపు తప్పి వెనుకకు జారడం ప్రారంభిస్తుంది. అయితే డ్రైవర్ వేగంగా స్పందించాడు. తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు.. లారీ అదుపు తప్పి వెనక్కు వెళ్లడం ప్రారంభించడంతో డ్రైవర్ అందులో నుంచి వేగంగా బయటకు దూకేశాడు. ఆ తర్వాత ట్రక్కు జారి కాలువలో పడిపోయింది. ఈ ఘటన మనాలిలోని సోలాంగ్ వ్యాలీలో చోటుచేసుకుంది. ఇది చూసి అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు.
వీడియో ఇక్కడ చూడండి..
बहुत रिस्की है बर्फबारी के बीच गाड़ी लेकर बाहर निकलना । देखे किस तरह यह वाहन स्किड होकर खाई की तरफ जा गिरा । घटना सोलांग वैली, मनाली की है ।#himachalpradesh #manalisnowfall 🌨️🌨️#HimachalPradesh pic.twitter.com/GoJwTyqPcK
— Naveen Sharma( हमीरपुर का सेवादार) (@naveen_hmr) December 28, 2024
హిమపాతంలో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఈ వాహనం ఎలా జారి కాలువలో పడిపోయిందో చూస్తే నిజంగానే గుండె జారిపోయినట్టుగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇలాంటి సమయంలో మనాలి పర్యటనను కొద్ది రోజులు వాయిదా వేసుకోవటం మంచిది అంటూ పర్యాటకులకు పలు సూచనలు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి