AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేస్తున్నారా?..అయితే మీరు చాలా నష్టపోతున్నట్లే

ఇది ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D, ఇనుము, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాంటి గుడ్డులోని పచ్చ సొనను కొందరు బయట పడేస్తుంటారు. కేవలం తెల్లసొన మాత్రమే తింటుంటారు. నిజానికి మనం తినాల్సింది పచ్చ సొననే అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

గుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేస్తున్నారా?..అయితే మీరు చాలా నష్టపోతున్నట్లే
సాధారణంగా గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం పెంచే గోధుమ కోళ్లు గోధుమ రంగు గుడ్లు పెడతాయి. ఈ కోళ్లు పరిమాణంలో పెద్దవి కావడంతో ఎక్కువ మేత అవసరం. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి వ్యయం ఎక్కువ. ఇక ఫౌల్ట్రీ కోళ్లు సంతానోత్పత్తి కొంత చౌకగా ఉంటుంది. బ్రౌన్ కోళ్ల కంటే వాటికి తక్కువ మేత అవసరం. అందుకే తెల్ల కోడిగుడ్ల ధర గోధుమ కోడిగుడ్ల కంటే కాస్త తక్కువ.
Jyothi Gadda
|

Updated on: Dec 30, 2024 | 9:25 PM

Share

Egg Yolk: పోషకాల పవర్ హౌస్… కోడిగుడ్డు అంటారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే చాలు… మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఇది ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D, ఇనుము, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాంటి గుడ్డులోని పచ్చ సొనను కొందరు బయట పడేస్తుంటారు. కేవలం తెల్లసొన మాత్రమే తింటుంటారు. నిజానికి మనం తినాల్సింది పచ్చ సొననే అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

గుడ్డులోని పచ్చ సొన పోషకాల గని. అయితే చాలా మంది కొలెస్ట్రాల్ భయంతో పచ్చ సొనను తినడానికి వెనుకాడుతుంటారు, కానీ నిజానికి పచ్చ సొనలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చసొన తినడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే వదిలి పెట్టకుండా తింటారు. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటినోల్ రూపంలో దొరుకుతుంది. మన కళ్ళలోని రెటీనాకు ఇది చాలా అవసరం. రేచీకటి రాకుండా అడ్డుకుంటుంది. వయసు పెరుగుతుంటే వచ్చే అంధత్వం రాకుండా రక్షిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మంపై ముడతలు పడడం, మొటిమలు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి. మన శరీరానికి అత్యవసరమైన బి విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.బి విటమిన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి.

గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడం చాలా అవసరం. లేకుంటే అధిక రక్తస్రావమై ప్రాణాపాయం కలుగుతుంది. ఇలా గాయాల నుంచి రక్తాన్ని ఆపే శక్తి విటమిన్ Kకు ఉంది. ఇది గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. అలాగే, గుడిలోని పచ్చసొనలోనే విటమిన్ డి మూలాలు ఉంటాయి. ఇది ఆస్టియోపొరాసిస్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఈ కూడా మెరుగ్గా ఉంటుంది. దీన్ని తినడం వల్ల చర్మానికి ఎలాంటి నష్టాలు రావు. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?