Viral Video: వార్నీ ఇదెక్కడి విడ్డూరం.. నవ వధువును అమ్మకానికి తీసుకెళ్లిన వరుడు..! షాకింగ్ వీడియో
ఈ వీడియోపై నెటిజన్లు ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. నవవధువును అమ్మడానికి బయలుదేరాడని ఒకరు. మరొకరు తగ్గింపు రేటు గురించి సమాచారం కావాలి అంటూ కామెంట్ చేశారు. మరో వ్యక్తి పూర్తి తగ్గింపును డిమాండ్ చేసి, సోదరా ఇది ఉచితంగా ఇచ్చిన కూడా ఖరీదైనదే అంటూ పేర్కొన్నారు. నిజంగా ఇది ఫన్నీ వీడియో అని స్పష్టమవుతోంది. రీల్స్ చేయడానికి ప్రజలు
సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక వైరల్ వీడియోలు కనిపిస్తాయి. వీటిలో పెళ్లికి సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగానే షేర్ అవుతుంటాయి. అయితే వీటిలో కొన్ని వీడియోలు చూసేందుకు చాలా ఫన్నీగా ఉంటే, మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. మొత్తానికి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు వేగంగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి ఒక ఫన్నీ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది మిమ్మల్ని నవ్విస్తుంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
పెళ్లి విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఎంతో ఆసక్తిగా ఉంటారు.. వివాహంలోని ప్రతి ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా జరిపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుత కాలంలో వివాహాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి కుటుంబం వారి కుమార్తె కోసం ఉత్తమ అబ్బాయి కోసం చూస్తుంది. కానీ, ప్రతిఒక్కరి జీవితంలో అన్ని ఆశలు నెరవేరవు. ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో వరుడు చేసిన పని అందరినీ షాక్ అయ్యేలా చేసింది. కొత్తగా పెళ్లయిన వరుడు తన భార్యను అమ్మడానికి బయలుదేరాడు. అవును మీరు విన్నది నిజమే.. రిక్షా బండిపై నవ వధువును కూర్చొబెట్టుకుని అమ్మకానికి బయల్దేరాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.
SuperfastamdavadLive Instagramలో షేర్ చేసిన వీడియోలో వరుడి గెటప్‌లో ఉన్న యువకుడు తన వధువును రిక్షా బండిపై ఎక్కించుకుని వీధుల్లో తిరుగుతున్నాడు. బండిని తన చేతులతో నెడుతూ కాసేపు, తోసుకుంటూ కొద్ది సేపు రద్దీగా ఉన్న రోడ్డు దాటుతున్నాడు. వధువు మాత్రం ఆ బండిపై హాయిగా కూర్చుని ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వీడియోపై నెటిజన్లు ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. నవవధువును అమ్మడానికి బయలుదేరాడని ఒకరు. మరొకరు తగ్గింపు రేటు గురించి సమాచారం కావాలి అంటూ కామెంట్ చేశారు. మరో వ్యక్తి పూర్తి తగ్గింపును డిమాండ్ చేసి, సోదరా ఇది ఉచితంగా ఇచ్చిన కూడా ఖరీదైనదే అంటూ పేర్కొన్నారు. నిజంగా ఇది ఫన్నీ వీడియో అని స్పష్టమవుతోంది. రీల్స్ చేయడానికి ప్రజలు ఏ స్థాయికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు అనటానికి ఇది కూడా ఉదాహరణ అంటున్నారు చాలా మంది నెటిజన్లు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి