Corona India: సంక్షోభ‌ స‌మ‌యంలో భార‌త్‌కు అండ‌గా నిలుస్తోన్న అంత‌ర్జాతీయ క్రికెట్ ప్ర‌పంచం.. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్‌..

Corona India: భార‌తదేశం గ‌తంలో ఎన్న‌డూ క‌నివీని ఎర‌గ‌ని సంక్షోభ స‌మ‌యాన్ని ఎదుర్కుంటోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా దేశం మొత్తం అతలాకుత‌ల‌మవుతోంది. వేల సంఖ్య‌లో...

Corona India: సంక్షోభ‌ స‌మ‌యంలో భార‌త్‌కు అండ‌గా నిలుస్తోన్న అంత‌ర్జాతీయ క్రికెట్ ప్ర‌పంచం.. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్‌..
Brett Lee Pat Cummins
Follow us

|

Updated on: Apr 27, 2021 | 9:31 PM

Corona India: భార‌తదేశం గ‌తంలో ఎన్న‌డూ క‌నివీని ఎర‌గ‌ని సంక్షోభ స‌మ‌యాన్ని ఎదుర్కుంటోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా దేశం మొత్తం అతలాకుత‌ల‌మవుతోంది. వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు, లక్ష‌ల సంఖ్య‌ల్లో కేసుల‌తో దేశం చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ఇక ఆక్సిజ‌న్ అంద‌క ఎంతో మంది జ‌నాలు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ప్రపంచ దేశాల‌కు వ్యాక్సిన్ అందించిన భార‌త్.. ప్రస్తుతం క‌రోనాతో క‌కావిక‌లమవుతోంది. ప్ర‌స్తుతం భారత్‌లో ఉన్న ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు ప్ర‌పంచ స‌మాజం చేతులు క‌లుపుతోంది. ఇప్ప‌టికే అమెరికా సాయం అందిస్తుంద‌ని దేశ అధ్య‌క్షుడు తెలిపారు. అంతేకాకుండా గూగుల్‌, మైక్రోసాఫ్ట్ సీఈఓలు కూడా భార‌త్‌కు మ‌ద్ధ‌తుగా నిలిచిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ బాట‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ ప్ర‌పంచం కూడా వ‌చ్చి చేరింది. తాజాగా ఆస్ట్రేలియా ఆట‌గాడు పాట్ క‌మ్మిన్స్ పీఎం కేర్ ఫండ్స్‌కు ఏకంగా 50 వేల డాల‌ర్లు అందించి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. క‌మ్మిన్స్ చూపిన ఈ దారిలో ఆస్ట్రేలియా మాజీ ప్లేయ‌ర్ బ్రెట్‌లీ కూడా న‌డిచాడు. తాజాగా 1 బిట్ కాయిన్‌ను విరాళంగా ప్ర‌క‌టిస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ సందేశాన్ని విడుద‌ల చేశాడు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ ట్వీట్‌లో బ్రెట్‌లీ.. భార‌త్ నాకు రెండో ఇంటి లాంటిది. నా వృత్తిప‌రంగా, వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగా భార‌త ప్ర‌జ‌లు చూపిన ప్రేమ నా గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచి పోతుంది. భార‌త్‌లో ఆక్సిజ‌న్ అందించేందుకు గాను 1 బిట్ కాయిన్‌ను విరాళంగా అందిస్తున్నాను. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో ముందు వ‌రుస‌లో నిల‌బ‌డి సేవ చేస్తోన్న వారికి నా కృత‌జ్ఞ‌త‌లు అని సుధీర్ఘంగా రాసుకొచ్చాడు బ్రెట్‌లీ.

పాట్ క‌మ్మిన్స్ చేసిన ట్వీట్‌..

బ్రెట్‌లీ చేసిన ట్వీట్‌..

Also Read: Oxygen: తన ప్లాంట్‌లో రూ.1కే సిలిండర్‌ నింపుతున్న మనోజ్‌ గుప్తా.. కోవిడ్‌ రోగులపై మానవత్వం చాటుతున్న వ్యాపారవేత్త

Corona Vaccination: కరోనాకు వ్యాక్సిన్‌తోనే చెక్.. ప్రపంచ దేశాల గణాంకాంలేం చెబుతున్నాయంటే?

Support to India: త్రివర్ణంతో మెరిసిపోయిన అబుదాబీలోని యాస్ ద్వీపం..కష్ట సమయంలో వారిచ్చిన మద్దతుకు నెటిజనం ఫిదా!