CORONA SECOND-WAVE: దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్.. మే 2న ప్రకటించనున్న ప్రధాని మోదీ!

దేశం మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ దిశగా వెళుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా జాగ్రత్తలను ప్రజలే మాత్రం సీరియస్‌గా తీసుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం స్థానికంగా లాక్ డౌన్ లాంటి నిర్ణయాలు..

CORONA SECOND-WAVE: దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్.. మే 2న ప్రకటించనున్న ప్రధాని మోదీ!
Modi With India Lockdown
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 27, 2021 | 7:52 PM

CORONA SECOND-WAVE LEADING TOTAL LOCK-DOWN: దేశం మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ దిశగా వెళుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా జాగ్రత్తలను ప్రజలే మాత్రం సీరియస్‌గా తీసుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం స్థానికంగా లాక్ డౌన్ లాంటి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలకు ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సు భేటీలో ప్రకటించారు. అయితే స్థానికంగా వున్న రాజకీయపరమైన అంశాలతో రాష్ట్రాలు కూడా సంపూర్ణ లాక్ డౌన్ దిశగా అడుగులు వేయకుండా.. కేవలం రాత్రిపూట కర్ఫ్యూలతో నెట్టుకొస్తున్నాయి. ఫలితంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలో ఉధృతమవుతోంది. ఈ క్రమంలో కేంద్రమే కఠిన నిర్ణయానికి సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే.. కఠిన నిర్ణయానికి ఓ బ్రేక్ వుండడంతో మే రెండో తేదీ తర్వాతనే సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ కఠిన నిర్ణయం తీసుకోవడంలో కేంద్రానికి బ్రేక్ వేస్తున్న ఆ అంశమేంటి?

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా దేశంలో ప్రతీ రోజులు మూడు లక్షలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్రాలు.. రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చినా కఠిన నిర్ణయాలకు వెనుకంజ వేస్తున్నాయని కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. కరోనా కట్టడికి రాష్ట్రాలే ఏ చర్యలు తీసుకున్నా కేంద్ర సహకరిస్తుందని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రుల భేటీలో ప్రకటించారు. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తోందని పలువురు ప్రతిపక్ష పార్టీలంటున్నాయి. నిజానికి గతంలో లాక్ డౌన్ విధించినప్పుడు ప్రజలకు అస్సలు సమయం ఇవ్వకుండా లాక్ డౌన్ పెట్టి వలస జీవులను రోడ్డున పడేశారంటూ విమర్శించిన వారే ఇపుడు రివర్స్‌లో లాక్ డౌన్ విషయంలో కేంద్ర ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దేశంలో హెల్త్ ఎమర్జీన్సీ విధించే అవకాశం ఉన్నా అలాంటి ప్రయత్నం చేయడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోవడానికి నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అడ్డంకిగా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే మే 2వ తేదీ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా చర్చ సాగుతోంది.

వాస్తవానికి కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభంలోనే అప్రమత్తం కావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న ఎన్నికలతో కరోనా కట్టడి చర్యలపై దృష్టి సారించలేదని స్పష్టంగా తెలుస్తోంది. తత్ఫలితం ఇంత పెద్ద స్థాయిలో కరోనా విస్ఫోటనం జరిగిందని విదేశీ మీడియా నొక్కి చెబుతోంది. కరోనా వ్యాప్తికి ఇటీవల జరిగిన ఎన్నికలే కారణమని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యలు అక్షరసత్యమని మేధావులు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, ప్రభుత్వాలు కరోనాను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు చేస్తున్నారు. అందువలనే పెద్ద ఎత్తున కరోనా వ్యాపించిందని చెబుతున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణలో ఏకంగా ముఖ్యమంత్రికి కరోనా సోకిందని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సభతోనే సీఎం కేసీఆర్‌కు కరోనా సోకిందని అందరికీ తెలిసిన రహాస్యమేనని పేర్కొంటున్నారు. ఇక పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిల్లోనూ పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దేశంలో తగ్గినట్టు తగ్గి ఒక్కసారిగా కేసులు పెరగడంతో అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం.

ఇంత జరుగుతున్నా కేంద్రం ఇప్పుడు కూడా స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ఎలా అని ప్రతిపక్షాలతో పాటు మేధావులు ప్రశ్నిస్తున్నారు. కరోనా కట్టడి చర్యలపై కఠిన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయడానికి ఎందుకు జంకుతోందని నిలదీస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాల వెల్లడే కారణమని వారే సమాధానం చెబుతున్నారు. ఇంకా పశ్చిమబెంగాల్‌లో మరో దశ పోలింగ్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయనే యోచనలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్రం తీరుపై సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఖాతరు చేయడం లేదని రాష్ట్రాలు మండిపడుతున్నాయి. అయితే ఎన్నికల ముగింపుతో పాటు ఫలితాలు మే 2వ తేదీన ఫలితాల వెల్లడి తర్వాతనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాతో పాటు విశ్లేషకులు చెబుతున్న మాట. ఇదే సమాచారంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నట్లు గుర్తు చేస్తున్నారు. మే 2వ తేదీన ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోందని పునరుద్ఘాటిస్తున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మరి మే 2వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ALSO READ: కరోనాకు వ్యాక్సిన్‌తోనే చెక్.. ప్రపంచ దేశాల గణాంకాంలేం చెబుతున్నాయంటే?

ALSO READ: ఆత్మావలోకనంలో కేంద్ర ఎన్నికల సంఘం? చివరి అంకంలో దిద్దుబాటు చర్యలు!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..