AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కుటుంబానికి ఇది అత్యంత కష్టసమయం.. కరోనా పాజిటివ్ వచ్చింది.. డాక్టర్ల సలహాలను పాటిస్తున్నా.. నటి హీనా ఖాన్..

Hina Khan: సినీ పరిశ్రమలో కరోనా మరింత విజృంభిస్తోంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణలు ఆగిపోగా.. విడుదల కావల్సిన

నా కుటుంబానికి ఇది అత్యంత కష్టసమయం.. కరోనా పాజిటివ్ వచ్చింది.. డాక్టర్ల సలహాలను పాటిస్తున్నా.. నటి హీనా ఖాన్..
Hina Khan
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2021 | 12:56 PM

Share

Hina Khan: సినీ పరిశ్రమలో కరోనా మరింత విజృంభిస్తోంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణలు ఆగిపోగా.. విడుదల కావల్సిన చిత్రాలను వాయిదా వేసుకున్నారు మేకర్స్. ఇక బుల్లితెరపై కరోనా ప్రభావం భారీగానే పడింది. అటు వెండి తెర నటీనటులు ఇప్పటికే కరోనా బారిన పడగా.. ఇటీవల బుల్లితెర యాక్టర్స్ కూడా ఈ మహమ్మరి బారిన పడుతున్నారు. తాజాగా మరో టెలివిజన్ నటి హీనా ఖాన్ కు కరోనా సోకింది. ఈ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. నాకు, నా కుటుంబ సభ్యులకు ఇది అత్యంత కష్టతరమైన సమయం. ఇలాంటి టైంలో నాకు కరోనా వచ్చిందని తేలింది. ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటూ డాక్టర్ల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి. ఇప్పుడు నాకు మీ అందరి ప్రార్థనలు ఎంతో అవసరం అంటూ పోస్ట్‌ చేసింది. ఇదిలా ఉంటే గత వారం క్రితమే ఆమె తండ్రి గుండెపోటుతో మరణించారు. దీంతో కొన్ని రోజులు హీనా ఖాన్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.

హిందీ స్టార్ ప్లస్ ఛానెల్ లో ప్రసారమైన యే రిష్ తా క్యా కెహ్లాతా హై సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా. అందులో అక్షర పాత్రతో ఎంతమంది ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ షోతో మరింత ప్రచారం పొందారు‌. బిగ్‌బాస్‌11 సీజన్‌లో పాల్గొని రన్నరప్‌ నిలిచి సత్తా చాటారు. ఇక హీనా ఖాన్‌ నటించిన తొలి చిత్రం లైన్స్‌..కేన్స్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఇక హీనాఖాన్ కు కరోనా సోకిన విషయం తెలియడంతో ఆమె అభిమానులు జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

View this post on Instagram

A post shared by HK (@realhinakhan)

Also Read:  Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మందులు వాడొచ్చా. ? డాక్టర్ల సూచనలు ఎంటంటే..

కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందా.. అయితే ఈ విషయాల్లో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే మోసం మొదటికే..

Corona Vaccine: మహిళలు పీరియడ్స్ సమయంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..