కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందా.. అయితే ఈ విషయాల్లో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే మోసం మొదటికే..

Corona Virus: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది.

కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందా.. అయితే ఈ విషయాల్లో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే మోసం మొదటికే..
Corona Negative
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 26, 2021 | 5:22 PM

Corona Virus: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అటు వ్యాక్సిన్ పంపిణి జరుగుతున్నా కానీ కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే కొన్ని లక్షణాలు ఉన్నాకానీ ప్రతి ఒక్కరు కోవిడ్ పరీక్ష చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇటీవల జరుగుతున్న సంఘటన దృష్ట్యా కోవిడ్ పరీక్షల రిజల్ట్స్ పైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షణాలు ఉన్నకానీ కోవిడ్ టెస్టులలో రిజల్ట్ నెగిటివ్ గా చూపిస్తుంది. అయితే కానీ అదే నెగిటివ్ రిపోర్ట్ వారి ప్రాణాలను బలితీసుకునేవారికి తెలియడం లేదు. ప్రస్తుతం కరోనా ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ కోసం రెండు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి RT-PCR, రెండోది యాంటిజెన్ పరీక్ష. ఇందులో నెగటివ్ వచ్చిందని ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చినప్పుడు ఏమి చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా టెస్ట్ చేసే విధానం..

RP-PCR రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్ స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. ఈ టెస్టులో ముక్కు లేదా గొంతు వద్ద కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. ఒక వ్యక్తి కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయాలను RT-PCR పరీక్షలు వెల్లడిస్తున్నాయి. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో కూడా వైరస్ సులభంగా బయటపడుతుంది. అయితే ప్రస్తుతం చాలా మందిలో నెగిటివ్ రిపోర్టులు వస్తున్నప్పటికీ, కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ టెస్టులను అందరూ చేయించుకోకుడదు. ఎవరైతే ఎక్కువగా జర్నీ చేస్తుంటారో.. జన సమూహం ఉండే చోట ఎక్కువగా తిరుగుతుంటారో.. అలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతోటి వారికి మీ స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులలో కరోనా లక్షణాలు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారితో మీరు ఎక్కువ సేపు గడిపినట్లయితే కచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే కరోనా సోకిన వారితో కనీసం 15 నిమిషాలు గడిపినా కూడా ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉంది.

మీరు కరోనా టెస్టు చేయించుకోవడానికి ముందు నీరు తాగడం లేదా ఏదైనా ఆహారం తీసుకోవడం వంటివి చేస్తే.. అది RT-PCR ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు కరోనా టెస్టు చేయించుకోవడానికి వెళ్లే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. కనీసం నీరు కూడా తాగకండి. కరోనా మహమ్మారి మొదటి దశలో సోకినప్పుడు.. చలి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బాడీ పెయిన్స్, రుచి-వాసన లేకపోవడం, గొంతులో మంట వంటి లక్షణాలు ప్రధానంగా కనిపించేవి. కానీ సెకండ్ వేవ్ లో అదనంగా తలనొప్పి, కళ్ల రంగు మారడం లేదా రోజ్ కలర్లోకి మారడం, కళ్ల నుండి నిరంతరాయంగా నీళ్లు కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మరి కొందరికి నిరంతరం దగ్గు, జ్వరానికి బదులు గ్యాస్ సమస్యలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరికొందరికి డయేరియా, విరేచనాల సమస్యలు కూడా వస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే నోరు పొడిగా ఉండటం, చిగుళ్ల సమస్యలు ఉ న్నా కూడా చాలా అలర్ట్ గా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

వైరస్ లో కొద్ది పాటి లక్షణాలు ఉండే రోగులు ఒకటి నుండి రెండు వారాల్లో కోలుకుంటారు. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నవారు మాత్రం కోలుకోవడానికి ఆరు లేదా ఏడు వారాలు పడుతుంది. అయితే కోవిద్-19 నుండి కోలుకున్న తర్వాత రోగి రిపోర్టు నెగిటివ్ వచ్చినా కూడా కొంచెం దగ్గు, బాడీ పెయిన్స్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, దాన్ని లాంగ్ కోవిద్ అంటారు.

లాంగ్ కరోనా లక్షణాలు..

1. చాలా మంది రోగులు కరోనా నుండి కోలుకున్న తర్వాత తాము తీసుకునే ఆహారం రుచిని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఈ కారణంగా వీరికి ఆకలి లేకపోవడం జరుగుతుంది. 2. అంతేకాదు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. కొన్ని వారాల పాటు ఈ సమస్య ఉంటుంది. దీని నివారణకు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. 3. అలసట, తలనొప్పి.. కరోనా వైరస్ సంక్రమణ సమయంలో తలనొప్పి మరియు అలసట ఉంటుంది. 4.కరోనా రిపోర్టు నెగిటివ్ వచ్చినప్పటికీ చాలాసార్లు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. మీకు మరీ ఎక్కువ తలనొప్పి లేదా అలసట ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

Also Read: మళ్లీ తెరపైకి రానున్న ‘మాతృదేవోభవ’!!.. నయనతారతోపాటు మరో హీరోయిన్‏తో రీమేక్…

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.