మళ్లీ తెరపైకి రానున్న ‘మాతృదేవోభవ’!!.. నయనతారతోపాటు మరో హీరోయిన్‏తో రీమేక్…

Matrudevobhava Movie:  టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా మాతృదేవోభవ. 1991లో విడుదలైన ఈ సినిమా

మళ్లీ తెరపైకి రానున్న 'మాతృదేవోభవ'!!.. నయనతారతోపాటు మరో హీరోయిన్‏తో రీమేక్...
Matrudevobhava
Rajitha Chanti

|

Apr 26, 2021 | 4:58 PM

Matrudevobhava Movie:  టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా మాతృదేవోభవ. 1991లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. యావత్ తెలుగు మహిళా ప్రేక్షకలోకాన్ని థియేటర్ వైపు నడిపించింది. ఈ చిత్రం విడుదలై 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. మరోసారి ఈ సినిమాను రీమేక్ చేయాలని యోచిస్తున్నారు మేకర్స్. నిజానికి ఈ సినిమా మొదటిసారి కూడా రీమేకే. మలయాళ హిట్ సినిమా ‘ఆకాషదూతు’ను తెలుగులో ‘మాతృదేవోభవ’ పేరుతో రీమేక్ చేశారు. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రాన్ని.. దర్శకుడు అజయ్ కుమార్ తెరకెక్కించారు. అయితే.. రామారావు మరోసారి అజయ్ కుమార్ తోనే ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. Matrudevebhava movie

నిర్మాత కె.ఎస్ రామారావు దర్శకుడు అజయ్ కుమార్ ఇటీవల తెరవెనుక కథలు అనే టాక్ షోలో పాల్గోన్నారు. అందులో కె.ఎన్ రామారావు మాట్లాడుతూ.. స్టార్ హీరోయిన్ నయనతారతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందని చెప్పారు. అనుష్క, కీర్తి సురేష్ ను కూడా అనుకున్నట్టు చెప్పారు. అయితే.. వీరు టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్నారు కాబట్టి.. పారితోషికం భారీగా డిమాండ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఆయన తక్కువ బడ్జెట్ తో సినిమాను రిమేక్ చేసే యోచనలో ఉన్నారట. అయితే ఈ సినిమా కోసం నయన్, అనుష్క ఎంత డిమాండ్ చేస్తారనేది చూడాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పుడు ప్రకటించబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది.

Also Read: సోనూసూద్ బాటలో మరో బాలీవుడ్ నటుడు.. కరోనా పేషెంట్ల కోసం ఆసుపత్రి నిర్మించనున్న గుర్మీత్..

Pelli Sandadi 2: ఆ రోజునే దర్శకేంద్రుడి కొత్త పెళ్లి ‘సందడి’ మొదలయ్యేది..  డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. 

Vijaya Laxmi: మూడు నెలలుగా అద్దె చెల్లించని నటి.. అర్థరాత్రి రోడ్డుపై సామాన్లు విసిరేసిన యాజమాని..

Daggubati Abhiram: అన్న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితోనే లాంచ్ కానున్న అభిరామ్‌..? ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu