Vijaya Laxmi: మూడు నెలలుగా అద్దె చెల్లించని నటి.. అర్థరాత్రి రోడ్డుపై సామాన్లు విసిరేసిన యాజమాని..
సినీ నటి విజయలక్ష్మిని మరోసారి సినిమా కష్టాలు చుట్టుముట్టాయి. అద్దె చెల్లించలేదంటూ ఆమె ఉంటున్న ప్లాట్ మేనేజర్ సామాన్లు బయట పడేశాడు.
సినీ నటి విజయలక్ష్మిని మరోసారి సినిమా కష్టాలు చుట్టుముట్టాయి. అద్దె చెల్లించలేదంటూ ఆమె ఉంటున్న ప్లాట్ మేనేజర్ సామాన్లు బయట పడేశాడు. దీంతో అర్థరాత్రి వేళ ఆమె రోడ్డు పై బైఠాయించింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి ప్రత్యామ్యం కల్పించారు. నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమాన్ తనను మోసం చేశారంటూ గతంలో నటి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆత్మహత్యాయత్నాలు చేయడం వంటి పరిణామాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సీమాన్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో నామ్ తమిళర్ కార్యకర్తలు పలుమార్లు ఆమెకు బెదిరింపులు కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల రూపంలో ఇప్పటికీ ఈ నటి కష్టాలు పడుతునే ఉంటుంది.
ఇదిలా ఉంటే.. టీనగర్ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్‌మెంట్‌లో విజయలక్ష్మి, ఆమె సోదరి ఉన్నారు. ఆమె సోదరి అనారోగ్యం పాలు కావడంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం రాత్రి డిశ్చార్జ్ కావడంతో ఇంటికి చేరుకున్న ఆమెకు షాక్ తప్పలేదు. తమ ప్లాట్‌లో మరో వ్యక్తి ఉండడంతో మేనేజర్ విఘ్నేశ్వరన్‌ను సంప్రదించారు. మూడు నెలలుగా అద్దె చెల్లించని కారణంగా సామన్లు మరో గదిలో పెట్టినట్టు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన విజయలక్ష్మి, మీడియాకు సమాచారం అందించారు. తన సామాన్లు బయట పడేశారని, రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఈ ప్లాట్‌లో రాజకీయ నేత హరినాడర్ అన్నయ్య తీసుకొచ్చి ఉంచారని, ఆయనకు తెలియకుండా ఇలా తనను రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో యాజమాని కల్పించుకొని తాము ఆమె సామాన్లు బయటపడేయలేదని.. వేరే గదిలో ఉంచామని తమ ప్లాట్ సిబ్బంది శివాను చెప్పుతో కొట్టడంతోనే తాము ఇలా చేశామని చెప్పారు. హరినాడర్‌కు ఈ ప్లాట్‌కు సంబంధం లేదని, ఆమెను జావెద్ అనే వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ ఈ వ్యవహారం ముదరడంతో పాటు సీమాన్ నువ్వయినా ఆదుకో అంటూ విజయలక్ష్మి కన్నీటి పర్యంతం కావడంతో చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. తేనాంపేట పోలీసులు విచారించి విజయలక్ష్మికి ప్రత్యామ్నాయం కల్పించారు.
Also Read: ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో విషాదం.. పూడ్చలేని నష్టమిది.. ఎలా అధిగమించాలో తెలియడం లేదు అంటూ ట్వీట్..