ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో విషాదం.. పూడ్చ‌లేని న‌ష్టమిది.. ఎలా అధిగమించాలో తెలియ‌డం లేదు అంటూ ట్వీట్..

Atlee Kumar:  ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తాతయ్య సౌందరా పాండియన్

ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో విషాదం.. పూడ్చ‌లేని న‌ష్టమిది.. ఎలా అధిగమించాలో తెలియ‌డం లేదు అంటూ ట్వీట్..
Atlee Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 26, 2021 | 11:26 AM

Atlee Kumar:  ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తాతయ్య సౌందరా పాండియన్ కన్నుముశారు. ఈ విషయాన్ని అట్లీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఎమోషనల్ అయ్యారు. ఆయనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మా తాత ఎం. సౌందరా పాండియన్ చనిపోయారు. పూకడ్చలేని నష్టమిది.. దీన్ని ఎలా అధిగమించాలో తెలియడం లేదు. ఆయన నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. నేను ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీరే నా రోల్ మోడల్, లవ్ యూ, మిస్ యూ.. మీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ ట్వీట్ చేశారు అట్లీ.

ఇక అట్లీ ఈ విషయాన్ని షేర్ చేయడంతో పలువురు ప్రముఖులతోపాటు అభిమానులు ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలిచిత్రం రాజా రాణితో సూపర్ హిట్ అందున్నాడు అట్లీ. ఈ సినిమా తర్వాత అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పటివరకు తమిళ స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ.. టాప్ డైరెక్టర్ రేసులో దూసుకుపోతున్నాడు అట్లీ. ఇదిలా ఉంటే త్వరలో అట్లీ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. తెలుగులోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ఓ మూవీ రూపొందించనున్నాడని టాక్ నడుస్తోంది. త్వరలో వీరిద్దరి కాంబోకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read: Oscar Awards 2021: అట్టహాసంగా ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘నో మ్యాడ్ ల్యాండ్’..

సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం… పూజా హెగ్డేకు కోవిడ్ పాజిటివ్.. క్యారంటైన్‏లో బుట్టబొమ్మ..