Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్న సూప‌ర్ స్టార్‌.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్ బాబు..

Covid Vaccine: క‌రోనా సెకండ్ వేవ్ భార‌త దేశాన్ని అత‌లాకుత‌లం చేసేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసుల సంఖ్య భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. మే చివ‌రి నాటికి కేసుల సంఖ్య ఇంకా...

Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్న సూప‌ర్ స్టార్‌.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్ బాబు..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 26, 2021 | 10:48 AM

Covid Vaccine: క‌రోనా సెకండ్ వేవ్ భార‌త దేశాన్ని అత‌లాకుత‌లం చేసేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసుల సంఖ్య భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. మే చివ‌రి నాటికి కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతోన్న లెక్క‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంద‌న్న ఒక్క వార్తే ఇప్పుడు అంద‌రినీ ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. అయితే కొంద‌రిలో వ్యాక్సిన్‌పై అనుమానాలున్న నేప‌థ్యంలో సెల‌బ్రిటీలు సైతం వ్యాక్సినేష‌న్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. తాము వ్యాక్సిన్ తీసుకున్న విష‌యాన్ని ప్ర‌పంచంతో పంచుకుంటూ వ్యాక్సిన్‌పై అపోహ‌ల‌ను తొలిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఆదివారం వ్యాక్సిన్ తీసుకున్న మ‌హేష్‌.. ట్వీట్ చేస్తూ.. “నేను కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నాను. ద‌య‌చేసి మీరు కూడా వ్యాక్సినేష‌న్ చేయించుకోండి. క‌రోనా సెకండ్ వేవ్ అంద‌రినీ చాలా బ‌లంగా తాకుతోంది. దీనిని వ్యాక్సినేష‌న్‌తోనే అడ్డుకోగ‌లం. 18 ఏళ్లు నిండి వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి అర్హ‌త ఉన్న వారందరూ మే 1 నుంచి వ్యాక్సిన్ తీసుకోండి. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి” అంటూ రాసుకొచ్చారు మ‌హేష్‌.

మ‌హేష్ చేసిన ట్వీట్‌..

ఇదిలా ఉంటే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సినేష‌న్ ప్రక్రియ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కరోనా టీకా కోసం ముందుగా కొవిన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఏప్రిల్‌ 28 నుంచి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 29వ రోజు అదే కేంద్రంలో రెండవ డోస్‌ కోసం ఆటో మేటిక్ గా షెడ్యూల్ ఫిక్స్‌ అవుతుంది. ఒకవేళ యూజర్ మరొక నగరానికి మారినట్లయితే, ఆ నగరంలోని సమీప టీకా కేంద్రంలో తిరిగి షెడ్యూల్ చేసుకోవాలి.

Also Read: Viral News: ఆహారాన్ని లాగిస్తున్న సింహం.. ఇంతలో అనుకోని షాక్.. అసలు ఏం జరిగిందంటే.!

Oscar Awards 2021: అట్టహాసంగా ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘నో మ్యాడ్ ల్యాండ్’..

మరో దేశం కూడా !ఇండియా నుంచి విమాన ప్రయాణాలను అనుమతించబోం, ఇటలీ ప్రకటన

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!