మరో దేశం కూడా !ఇండియా నుంచి విమాన ప్రయాణాలను అనుమతించబోం, ఇటలీ ప్రకటన,

కోరలు చాస్తున్న కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇండియా నుంచి విమాన ప్రయాణాలను అనుమతించేది లేదని ఇటలీ ప్రకటించింది. ఈ మేరకు ఈ దేశ ఆరోగ్య శాఖ మంత్రి రాబర్టో స్పెరాంజా...

మరో దేశం కూడా !ఇండియా నుంచి విమాన ప్రయాణాలను అనుమతించబోం, ఇటలీ ప్రకటన,
Italy Imposes Travel Ban From India
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 26, 2021 | 9:37 AM

కోరలు చాస్తున్న కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇండియా నుంచి విమాన ప్రయాణాలను అనుమతించేది లేదని ఇటలీ ప్రకటించింది. ఈ మేరకు ఈ దేశ ఆరోగ్య శాఖ మంత్రి రాబర్టో స్పెరాంజా ఈ బ్యాన్ కు సంబంధించిన ఉత్తర్వుపై సంతకం చేస్తున్నానని ట్వీట్ చేశారు. ఇండియాలో ఉన్న తమ దేశస్థులు నెగెటివ్ టెస్ట్ రిపోర్టుతో రావాలని ఆయన కోరారు. స్వదేశం చేరగానే వారు క్వారంటైన్ లోకి వెళ్లాలన్నారు. గత 14 రోజులుగా ఇండియాలో ఉండి ఇటలీ చేరినవారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని రాబర్టో పేర్కొన్నారు. భారత కొత్త కోవిడ్ వేరియంట్ పై తమ శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. గతంలో కన్నా ఇప్పుడు ఇండియాలో ఈ కేసులు పెరిగిపోవడానికి ఈ కొత్త వేరియంటే కారణమని తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, బ్రిటన్, యూఏఈ వంటి  దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాల సంఖ్యను కుదించి వేశాయి. . అలాగే భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి.

అయితే ఇదే సమయంలో జర్మనీ, సింగపూర్ వంటి దేశాలు ఆక్సిజన్ కంటెయినర్లను పంపడం ద్వారా ఇండియాకు అన్ని విధాలా సాయపడతామని ప్రకటించాయి.  యూఎస్, యూకే  ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చాయి. కాగాఇప్పటికే  –  సింగపూర్ నుంచి 23 ఆక్సిజన్ కంటెయినర్లు ఇండియాకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులు సతమతమవుతున్నాయి. వరుసగా  ఐదో రోజు కూడా ఇవి ఆక్సిజన్ కోసం ఎస్ ఓ ఎస్ మ్మేసేజులు పంపడం గమనార్హం. అరకొరగా ఆక్సిజన్ సప్లయ్ అవుతున్నప్పటికీ ఇది చాలడం లేదని పలు హాస్పిటల్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.  సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే ఆక్సిజన్ కోసం మొదట ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, తాజాగా దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలకు లేఖలు రాశారు.