AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscar Awards 2021: అట్టహాసంగా ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘నో మ్యాడ్ ల్యాండ్’..

Oscar Awards 2021: సినీ పరిశ్రమలో అత్యత్తమ పురస్కారంగా నిలిచేది ఆస్కార్ అవార్డ్. ఈ అవార్డులను జీవితంలో ఒక్కసారైన

Oscar Awards 2021: అట్టహాసంగా ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ చిత్రంగా నిలిచిన 'నో మ్యాడ్ ల్యాండ్'..
Oscars 2021
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2021 | 10:00 AM

Share

Oscar Awards 2021: సినీ పరిశ్రమలో అత్యత్తమ పురస్కారంగా నిలిచేది ఆస్కార్ అవార్డ్. ఈ అవార్డులను జీవితంలో ఒక్కసారైన అందుకోవాలని ఎంతోమంది ఆరాటపడుతుంటారు. అలాంటి ప్రతిష్టాత్మకంగా భావించే 93వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైనంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ వేడుకలను ప్రేక్షకులను అనమతించలేదు. కేవలం సెలబ్రెటీలు మాత్రమే ఇందులో పాల్గోన్నారు. ఇక ఈ అవార్డుల కార్యక్రమం స్టార్ వరల్డ్, స్టార్ మూవీస్ ఛానల్లలో సోమవారం ఉదయం 5.30 నుంచి భారత్ లో ప్రసారం కానుంది. అలాగే ఈ అవార్డుల వేడుకను ఆస్కార్.కామ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వేడుకలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) నిర్వహిస్తుంది.

ఇక అవార్డుల విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రంగా నో మ్యాడ్ ల్యాండ్ సినిమాను ప్రకటించగా.. ఉత్తమ దర్శకురాలిగా ఇదే సినిమా డైరెక్టర్ చోలో జావో అవార్డు అందుకుంది. అలాగే అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ది ఫాదర్‌ చిత్రానికి అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఎమరాల్డ్‌ ఫెన్నెల్‌కు ఆస్కార్‌ వరించింది. ఇక ఉత్తమ రచయితగా క్రిస్ట్ ఫర్ హ్యాంప్టన్, ఫ్లోరియన్ జెల్లర్ లకు, ఉత్తమ సహాయ నటుడిగా డానియల్ కలూయలు ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. అలాగే ఉత్తమ సహాయ నటిగా యువాన్ యు జంగ్ (మీనారి సినిమా)కు అవార్డు అందింది. దక్షిణ కొరియాలోనే ఆస్కార్ అందుకున్న తొలి నటిగా ఆమె రికార్డులకెక్కింది.

ఆస్కార్ విజేతలు..

☀ ఉత్తమ చిత్రం: నో మ్యాడ్‌ ల్యాండ్‌ ☀ ఉత్తమ చిత్రం ఎడిటింగ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌ ☀ఉత్తమ దర్శకురాలు: చోలే జావో‌ (నోమ్యాడ్‌ లాండ్‌) ☀ ఉత్తమ సహాయ నటుడు: డానియెల్‌ కలువోయా (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్ మెస్సయా) ☀ ఉత్తమ సహాయ నటి: యువాన్‌ యు–జంగ్(మీనారి) ☀ ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ అండ్‌ సినిమాటోగ్రఫి: మ్యాంక్‌ ☀ ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: టెనెట్‌ ☀ ఉత్తమ యానిమేషన్‌ ఫిల్మ్‌: ఇఫ్‌ ఎనీథింగ్‌ హ్యాపెన్స్‌ ఐ లవ్‌ యూ ☀ ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: అనదర్‌ రౌండ్‌ ☀ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: మై ఆక్టోపస్‌ టీచర్‌ ☀ ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌ ☀ ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: ది ఫాదర్‌ ☀ ఉత్తమ సినిమాటోగ్రఫీ: మ్యాంక్‌ ☀ ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌ ☀ ఉత్తమ క్యాస్టూమ్‌ డిజైన్‌: మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్ ☀ ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్ ☀ ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పీట్‌ డాక్టర్‌, దానా మరీ (సోల్‌) ☀ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌: అంథోనీ (కలెక్టివ్‌) ☀ ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: డోనాల్డ్‌ బర్ట్‌ (మ్యాంక్‌) ☀ ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌: సోల్ ☀ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: ఫైట్‌ ఫర్‌ యూ

Also Read: UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..