COVID Vaccine: 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్… . ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్! .. పూర్తి వివరాలు
కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కొన్ని సంస్థలు కూడా స్వయంగా....
18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్.. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్! కోవిన్ యాప్‌లో పేర్లు తేదీల నమోదు మే 1 నుంచి టీకా పంపిణీ కార్యక్రమం
మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం ఆమోదించింది. దీంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా టీకా కోసం ముందుగా కొవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది.
రిజిస్ట్రేషన్ ఎలా చెయ్యాలంటే….
మీ మొబైల్ నెంబర్‌తో కో-విన్ 2.0 పోర్టల్‌లో లాగిన్ కండి. ఫోటోతో ఉన్న ఏదైనా గుర్తింపు కార్డు,వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ చేయండి. షెడ్యూల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీరు టీకాకు అనువైన తేదీని ఎంచుకోవచ్చు. మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి వెతికితే టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకుని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు.
అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న ముందు రోజుల వరకు మాత్రమే రీ-షెడ్యూల్ కు అవకాశం ఉంటుంది. యూజర్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత 29వ రోజు అదే కేంద్రంలో రెండవ డోస్ కోసం ఆటో మేటిక్ గా షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది. ఒకవేళ యూజర్ మరొక నగరానికి మారినట్లయితే, ఆ నగరంలోని సమీప టీకా కేంద్రంలో తిరిగి షెడ్యూల్ చేసుకోవాలి. అపాయింట్‌మెంట్ ప్రింటవుట్‌తో పాటు టీకా తీసుకునే సమయంలో ఆ వ్యక్తి కో-విన్ 2.0 ]ోర్టల్‌లో పేర్కొన్న ఫోటో ఐడిని తీసుకెళ్లాలి. 45 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాదులు ఉన్నవారు టీకా సమయంలోవైద్య ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి.