పసికందును ఇంటికి తెచ్చుకునేందుకు హెలికాఫ్టర్ నే అద్దెకు తీసుకున్నాడు, రాజస్థాన్ పెద్దమనిషి
రాజస్తాన్ లోని నాగౌర్ జిల్లాలో తన గారాల మనవరాలిని ఇంటికి తెచ్చుకునేందుకు ఓ పెద్దమనిషి హెలికాఫ్టర్ నే అద్దెకు తీసుకున్నాడు. మదన్ లాల్ అనే ఆయన వివరాల్లోకి వెళ్తే..
రాజస్తాన్ లోని నాగౌర్ జిల్లాలో తన గారాల మనవరాలిని ఇంటికి తెచ్చుకునేందుకు ఓ పెద్దమనిషి హెలికాఫ్టర్ నే అద్దెకు తీసుకున్నాడు. మదన్ లాల్ అనే ఆయన వివరాల్లోకి వెళ్తే.. ఇతని కొడుకు హనుమాన్ ప్రజాపతి ఇతని భార్య చుకీదేవి దంపతులకు చాలాకాలంగా ఆడ సంతానం లేదు. అయితే గత మార్చి 3 న చుకీ దేవి ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. బాలింతగా ఉన్న ఆమె హర్ సొలావ్ అనే గ్రామంలోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇన్నాళ్లూ తన స్వగ్రామం నింబిడి చాంద్వాతా గ్రామంలో ఉన్న హనుమాన్ ప్రజాపతి ఇక తన కూతుర్ని, భార్యను ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు. దీంతో ఇతని తండ్రి మదన్ లాల్.. తన మనవరాలిని ఇంటికి తెచ్చుకునేందుకు హెలికాఫ్టర్ నే అద్దెకు తీసుకున్నాడు. ఈ గ్రామాల మధ్య హెలికాఫ్టర్ 10 నిముషాలపాటు ప్రయాణించి గమ్యం చేరింది. 35 ఏళ్ళ తరువాత తమ కుటుంబంలో ఆడబిడ్డ జన్మించిందని, ఈ చిన్నారిని తాము లక్ష్మీగా భావిస్తామని తాత అయిన మదన్ లాల్ ఆనందంతో చెబుతున్నాడు.
పదో తరగత మాత్రం పాసయిన హనుమాన్ ప్రజాపతి కూడా తన తండ్రి కోర్కెకు అడ్డు చెప్పలేదు. ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా ఒకటేనని, తమ కూతుర్ని బాగా చదివిస్తామని ఆయన అంటున్నాడు. తన మనవరాలిని హెలికాఫ్టర్ లో తెచ్చుకోవాలని ఆశ పడిన తన తండ్రిని హనుమాన్ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Corona Virus: మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని సులభంగా పెంచుకోవచ్చు.. కేవలం ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు…