Corona Virus: మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని సులభంగా పెంచుకోవచ్చు.. కేవలం ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు…

Oxygen in Blood: ఉపిరితిత్తుల వ్యాధి ఉన్నవారికి రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

Corona Virus: మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని సులభంగా పెంచుకోవచ్చు.. కేవలం ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు...
Oxygen In Blood
Follow us

|

Updated on: Apr 23, 2021 | 3:24 PM

Oxygen in Blood: ఉపిరితిత్తుల వ్యాధి ఉన్నవారికి రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండే ప్రమాదం ఉంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటే.. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే.. ఆసుపత్రిలో ఆక్సిజన్ తీసుకోవడం కూడా కష్టంగా మారే పరిస్థితి తలెత్తుతుంది. అలా కాకుండా.. మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవడానికి ఈ చిట్కాలను పాటిస్తే చాలు. మరీ అవెంటే తెలుసుకుందామా.

1. మీరున్న గదిలో వాతావరణం మారినట్టుగా అనిపించిన.. వెంటనే మీ గది కిటికీలను తెరవాలి. ప్రకృతి సిద్ధమైన గాలిలో శ్వాస తీసుకోవడం ఉత్తమం. అలాగే .. మీరు పీల్చే గాలి నాణ్యతను పరిశీలించడం కూడా ఉత్తమం. ఒకవేళ మీరు పట్టాణాల్లో జీవిస్తున్న వారు అయితే.. కిటీకిలు ఓపెన్ చేయడం వలన కలుషితమైన గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా.. ఎయిర్ ఫ్యూరిఫైయర్ వంటి ఎలక్రానిక్ వస్తువులను తీసుకోవడం ఉత్తమం. కానీ జాగ్రత్త కొన్ని ఫ్యూరిఫైయర్లు ఉపిరితిత్తులకు హని కలిగిస్తాయి.

2. అలాగే మీ ఇంట్లి చుట్టు పక్కల చెట్లను పెంచడం మంచిది. అలా వీలు కాకపోతే.. ఇంట్లోనే ఇండోర్ ప్లాంట్ పెంచడం మంచిది. వీటికి ఎక్కువగా సూర్యరశ్మి అవసరం ఉండదు.

3. ప్రతీ రోజూ వ్యాయం చేయాలి. అయితే ఉపిరితిత్తుల సమస్య ఉన్నవారు వ్యాయమాలకు సంబంధించిన వివరాలు వైద్యులను అడిగి తెలుసుకోవడం మంచింది. మీ శ్వాస రేటు పెరిగేకొద్ది మీ ఉపరితిత్తులు ఆక్సిజన్ ను ఎక్కువగా గ్రహిస్తాయి. దీంతో మీకు ఉపశమనం లభిస్తుంది.

4. ఎక్కువగా శ్వాస పీలుస్తూ.. ధ్యానం లేదా ప్రార్ధన చేయడంతో మీ రోజును ప్రారంభించండి. రోజుకు ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా చేస్తూ విశ్రాంతి తీసుకోవడం వలన మీ ఆక్సిజన్ తీసుకునే విధానాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఒత్తిడి తగ్గుతుంది.

5. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. మీ ఆహారం కొంతవరకు ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి. ఐరన్ ఎక్కువగా ఉండే మాంసం, ఫౌల్ట్రీ చేపలు, చిక్కుళ్ళు, ఆకు కూరలు తినడం ఉత్తమం. ఇవి మీ శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తాయి. అలాగే మీ శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాలే, బ్రోకలీ, సెలరీ, ఆకుకూరలు తీసుకోవడం ఉత్తమం.

Also Read: ఆక్సిజన్ సిలిండర్స్ పంపిస్తానన్న సుస్మితా సేన్.. నెటిజన్స్ ట్రోల్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హీరోయిన్..

Anasuya: చిన్నపిల్లగా మారిపోయిన అనసూయ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ధీటుగా స్పందించిన రంగమ్మాత్త..