బెడిసికొట్టిన దొంగతనం ప్లాన్.. దొంగలకు చుక్కలు చూపించిన సాహసికుడు.. అసలేం జరిగిందంటే.!
అమెరికాలో ఇద్దరు దొంగలు ఓవ్యక్తిని అటకాయించి చోరీ చేయాలని పక్కా ప్లాన్ వేసారు...
అమెరికాలో ఇద్దరు దొంగలు ఓవ్యక్తిని అటకాయించి చోరీ చేయాలని పక్కా ప్లాన్ వేసారు. అయితే వీరి ప్లాన్ రివర్స్ అయి అడ్డంగా బుక్కయ్యారు. కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి తన కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. అతను కారు తాళం తీసేలోపు ఇద్దరు దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చి తుపాకీ చూపి బెదిరించారు. అయితే ఇక్కడే దొంగల ప్లాన్ రివర్స్ అయింది.
దొంగల బెదిరింపులకు కారు యాజమాని భయపడలేదు. తుపాకీ చూపిన దొంగను గట్టిగా పట్టుకున్నాడు. అతన్ని ఒక్క దెబ్బతో కిందపడేసి కొట్టాడు. దొంగ ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో చేసేదేం లేక లొంగిపోయిన దొంగ గట్టిగా కేకలేసాడు. ఏడుస్తూ ‘సరే సరే ఆల్రైట్ నన్ను వెళ్లనివ్వండి’ అంటూ వేడుకున్నాడు. అతనితో వచ్చిన మరో దొంగకూడా అతన్ని వదిలిపెట్టండి అంటూ అరవడం వీడియోలో వినిపిస్తోంది. ఇక చివరికి ఆ వ్యక్తి దొంగను వదిలిపెట్టేసాడు. దీంతో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు.
ప్రస్తుతం ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో చేశారు. కాలిఫోర్నియాలో అతని దొంగతనం పాపం.. అనుకున్నట్లు జరగలేదు అనే క్యాష్టన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరలవుతోంది. సదరు వ్యక్తి ధైర్యాన్ని, సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.