Viral News: ఎత్తైన పర్వతంపై చిరుతపులి వేట.. కిందకు పడుతున్నా ఎరను విడవలేదు.. షాకింగ్ దృశ్యాలు..
మీరు తరచూ సింహం, చిరుతపులి లేదా పులి వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు.....
మీరు తరచూ సింహం, చిరుతపులి లేదా పులి వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైనా మంచు చిరుత (Snow Leopard) వేటాడటం చూశారా.? ఏంటి ఈ వింతైన ప్రశ్న అని అనుకోవద్దు.! మంచు చిరుతపులులు మంచు పర్వతాల ఎత్తులో నివసిస్తుంటాయి. ఎత్తైన పర్వతాల సమూహంలో వాటి వేట భయానకంగా ఉంటుంది. ఇక తాజాగా మంచు చిరుతపులికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ అద్భుతమైన వీడియో వీక్షకులను అబ్బురపరుస్తుంది. ఇందులో చిరుత పర్వత సమూహంపై ఎరను వేటాడుతున్నట్లు కనిపిస్తుంది. వేగానికి, వ్యూహానికి చిరుత మారుపేరు. ఎత్తైన పర్వతాలపై నుంచి పడిపోతున్నా కూడా తన నోటికి చిక్కన ఎరను మాత్రం చిరుత విడిచిపెట్టలేదు. ఆ దృశ్యాలు సినిమా సీన్ ను తలపించేలా ఒళ్లుగగుర్పొడిచే విధంగా ఉన్నాయి.
ఈ వీడియోను ఇండియన్ వైల్డ్ లైఫ్ అఫీషియల్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను 86 వేల మంది వీక్షించగా.. ప్రజలు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అంతేకాకుండా ఆ మంచు చిరుత వేటకు అందరూ కూడా మంత్రముగ్దులయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి…
View this post on Instagram