Theif: సారీ.. అవి కరోనా వ్యాక్సిన్లు అని తెలియదు.. లెటర్ రాసి.. టీకాలను తిరిగిచ్చేసిన దొంగ..

Theft of Covid-19 vaccines: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఓవైపు కరోనా వ్యాక్సిన్ల కొరత..

Theif: సారీ.. అవి కరోనా వ్యాక్సిన్లు అని తెలియదు.. లెటర్ రాసి.. టీకాలను తిరిగిచ్చేసిన దొంగ..
COVID-19 vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 23, 2021 | 8:32 AM

Theft of Covid-19 vaccines: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఓవైపు కరోనా వ్యాక్సిన్ల కొరత.. మరోవైపు ఆక్సిజన్, మందుల కొరతతో దేశమంతటా భయాందోళన నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. వింత సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. హర్యానా రాష్ట్రంలోని జింద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 1,700 కోవిడ్-19 వ్యాక్సిన్లను ఓ దొంగ ఎత్తుకెళ్లిన సంగతి తెలిసింది. అయితే ఆ వ్యాక్సిన్లను దొంగ మరలా తిరిగిచ్చేశాడు. జింద్‌లోని ఆసుపత్రిలో బుధవారం వ్యాక్సిన్లు దొంగతనానికి గురికావడం కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు, అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ దొంగ జింద్‌లోని సివిల్‌ లైన్స్‌ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా ఉన్న టీ కొట్టులో ఓ వ్యక్తికి వ్యాక్సిన్ల బాక్స్‌ను ఇచ్చి వెళ్లాడు. తాను పోలీసులకు ఆహారం సరఫరా చేస్తున్నానని.. తనకు వేరే అర్జెంట్ పని ఉందని.. ఈ బాక్స్‌ను పోలీసులకు ఇవ్వాలని చెప్పి దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు.

అనంతరం ఆ వ్యక్తి బాక్స్‌ను పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు దాన్ని తెరిచి చూడగా.. కోవ్యాక్సిన్, కోవిషీల్డ్‌ టీకా డోసులతో పాటు ఓ ఉత్తరం కనిపించింది. హిందీలో ఉన్న ఆ ఉత్తరంలో.. క్షమించండి. ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు.. అని రాశాడు. ఇది చూసిన వారు సరదాగా నవ్వుకున్నారు. ఏదిఏమైనా ఆ దొంగ వ్యాక్సిన్లను తిరిగి ఇచ్చేయడంపై పలువురు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం దొంగ రాసిన ఉత్తరం నెట్టింట వైరల్‌గా మారింది.

దొంగ రాసిన లెటర్..

Theif Letter

Theif Letter

ఇదిలాఉంటే.. ప్రస్తుతం మార్కెట్‌లో కరోనా చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. ఈ బాక్స్‌ను ఆ ఇంజక్షన్లుగా భావించి వ్యాక్సిన్లను దొంగ ఎత్తుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఈ దొంగపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:

Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది రోగుల సజీవ దహనం..

Suicide: విశాఖలో తీవ్ర విషాదం.. ఆరేళ్ల కొడుకును చంపి.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రైవేట్ స్కూల్ టీచర్.. సూసైడ్ నోట్‌లో ఏముంది?