Anasuya: చిన్నపిల్లగా మారిపోయిన అనసూయ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ధీటుగా స్పందించిన రంగమ్మాత్త..

Anasuya : బుల్లితెరపై టాప్ యాంకర్‏గా కొనసాగడమే కాకుండా.. అటు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనసూయ.

Anasuya: చిన్నపిల్లగా మారిపోయిన అనసూయ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ధీటుగా స్పందించిన రంగమ్మాత్త..
Anasuya
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 23, 2021 | 1:01 PM

Anasuya : బుల్లితెరపై టాప్ యాంకర్‏గా కొనసాగడమే కాకుండా.. అటు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనసూయ. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మాత్త పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ సినిమా తర్వాత అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గానే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతోపాటు, సినిమా విషయాలనే కాకుండా.. ప్రతి సారీ స్టైలిష్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనుసూయ చిన్న పిల్లలా మారిపోయింది. కొన్ని సంవత్సరాల వెనక్కు వెళ్ళినట్లుగా రెండు జడలు వేసుకుని పొట్టి బట్టల్లో దర్శనమిచ్చింది. నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు అలానే ఉన్నాను అంటూ ఆ ఫోటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇంకేముంది.. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్ బ్యాగ్ వేసుకోవడం మర్చిపోయిందని కొందరు సెటైర్లు వేశారు. అయితే ఓ నెటిజన్ మాత్రం.. కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. దీని గురించి నీకు కాస్తైనా బాధేయడం లేదా? ఇలాంటి సమయంలో ఈ ఫొటోలు ఎలా పెట్టాలనిపిస్తుంది? అసలు ఇప్పుడీ ఫొటోలు పోస్ట్‌ చేయడం అంత అవసరమా? అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ కూడా ధీటుగానే రిప్లై ఇచ్చింది. ఇలా విషమ పరిస్థితులల్లో కూడా జనాలకు కొంత వినోదం.. మరికొంత నమ్మకాన్ని కలిగించడానికే మేం ప్రయత్నిస్తున్నాం అంటూ బదులిచ్చింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమె సమాధానాన్ని సమర్థిస్తుండగా.. మరికొంత మంది విబేధిస్తున్నారు. అయితే అనసూయ సమాధానం చూసిన సదరు నెటిజన్.. ఈ సమయంలో జనాలకు కావాల్సింది చేయూత తప్ప వినోదం కానే కాదు. ఓ పక్క వాళ్లు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ చచ్చిపోతుంటే వారిని ఇలా ఎంటర్‌టైన్‌ చేయడం కరెక్ట్‌ అని ఎలా సమర్థించుకుంటున్నావు? ఇది కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చాడు. దీంతో అనసూయ ఫ్యాన్స్‌ అతడిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మరి బయట పరిస్థితులు అంత దారుణంగా ఉంటే నువ్వెందుకు ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతున్నావు? ఎవరు ఏ పోస్ట్‌ పెట్టారు? అని ఎందుకు చూస్తున్నావు, నీకు పనీపాటా లేదా? అంటూ అతడిని గట్టిగానే నిలదీశారు. ప్రస్తుతం అనసూయ మాస్ మాహారాజా రవితేజ ఖిలాడి, అల్లు అర్జున్ పుష్ప సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తోంది.

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ట్వీట్..

Also Read: Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు…

మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక..