Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు…

Aadhaar Card: ఆధార్ కార్డ్... ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందడానికి ముఖ్యంగా

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు...
Aadhaar Card
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 23, 2021 | 8:32 AM

Aadhaar Card: ఆధార్ కార్డ్… ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందడానికి ముఖ్యంగా ఆధార్ ఉండాల్సిందే. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందుకోవాలంటే కచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. అలాగే ఆధార్ ఉంటేనే ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయ్యెచ్చు. అందుకే ఆధార్ కార్డు మనకు చాలా ముఖ్యం. ఒకవేళ అది పొరపాటున పొగొట్టుకుంటే ఎలా… మళ్లీ మీ కార్డును తీసుకోవడానికి ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి. అలాగే మీ కార్డును ఎవరు దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే వెంటనే మీరు దానిని లాక్ చేయాల్సి ఉంటుంది. దీని వలన మీ కార్డు ఎలాంటి దుర్వినియోగం జరగదు. uidai number

అయితే మీ ఆధార్ కార్డును ఎలా లాక్ చేయాలని ఆలోచిస్తున్నారా ? అందుకు పెద్దగా ఏం చేయాల్సిన పని లేదండి. ముందుగా ఆధార్ లాక్ చేసుకోవడానికి మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మై ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఆధార్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇందులో మీరు లాక్, అన్‌లాక్ బయోమెట్రిక్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.  aadhar card ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెంట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‏కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. aadhar card ఆ వెంటనే మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ అవుతాయి. మీరు ఎంఆధార్ యాప్ ద్వారా కూడా సులభంగానే బయోమెట్రిక్స్‏ను లాక్, ఆన్ లాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇవే కాకుండా.. ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు.

Also Read: మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 

పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.22 ఆదా చేస్తే.. ఏకంగా రూ.8 లక్షలు పొందవచ్చు…

మీకు ఎస్‌బీఐలో రుణాలు ఇప్పిస్తామని ఫోన్‌లు వస్తున్నాయా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త…వెలుగులోకి వస్తున్న మోసాలు