మీకు ఎస్‌బీఐలో రుణాలు ఇప్పిస్తామని ఫోన్‌లు వస్తున్నాయా..? అయితే తస్మాత్ జాగ్రత్త…వెలుగులోకి వస్తున్న మోసాలు
SBI Customers Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి మాట్లాడుతున్నామని మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా..? లేక ఫోన్‌లు చేస్తున్నారా..? ఎస్‌బీఐలో పర్సనల్ లోన్, ఆటో??..
SBI Customers Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి మాట్లాడుతున్నామని మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా..? లేక ఫోన్‌లు చేస్తున్నారా..? ఎస్‌బీఐలో పర్సనల్ లోన్, ఆటో లోన్, బిజినెస్ లోన్ ఇప్పిస్తామని చెప్పారా..? అయితే అలర్ట్‌గా ఉండండి. ఇలాంటి కాల్స్ వస్తే మీరు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ సూచిస్తోంది. మామూలుగా బ్యాంకులకు చెందిన ప్రతినిధులు లోన్లు, క్రెడిట్ కార్డులు ఇస్తామని ఫోన్లు చేస్తుంటారు. ఇలా వచ్చే ఫోన్లలో మోసాలు కూడా ఉంటాయి. ఎస్‌బీఐ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో ఏకంగా ఓ సంస్థను పెట్టి అమాయకులను మోసం చేస్తున్న ఉదాంతాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఏకంగా భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ పేరుతో నకిలీ సంస్థలు సృష్టించి రుణాల పేరుతో మోసగిస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా,సులువుగా రుణాలు ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు ఎస్‌బీఐ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కస్టమర్లను హెచ్చరిస్తోంది. ఎస్‌బీఐ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో తమకు ఎలాంటి సంస్థ లేదని, అలాంటి సంస్థలతో తమకు ఏ సంబంధం లేదని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
ఎస్‌బీఐ ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. ఎస్‌బీఐ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతోనే కాదు, ఎస్‌బీఐ పేరు చెప్పుకొని మోసగాళ్లు కస్టమర్లను సంప్రదిస్తూ నిలువునా మోసగిస్తున్నారు. రుణాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారను. అంతేకాదు కస్టమర్లను నమ్మించేందుకు ఎస్‌బీఐ లోగో, బ్రాండ్ వాడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఎస్‌బీఐ లోగో చూడగానే కస్టమర్లు నిజంగానే ఎస్‌బీఐ సిబ్బంది సంప్రదించారని భావించి అడ్డంగా మోసపోతున్నారు. అందుకే ఎస్‌బీఐ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. రుణాల పేరుతో వచ్చే కాల్స్‌ని పట్టించుకోవద్దని, ఎస్ఎంఎస్, మెయిల్స్‌లో వచ్చే లింక్స్ క్లిక్ పొరపాటున క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తోంది. లేనిపోని లింకులను క్లిక్ చేసినట్లయితే సైబర్ మోసగాళ్ల చేతులు అడ్డంగా మోసపోతాని ఎస్‌బీఐ పదేపదే హెచ్చరిస్తోంది.
BEWARE SBI CUSTOMERS!
If you are contacted by SBI Loan Finance Ltd. or any such entities then be informed that these are not associated with SBI. They are giving fake loan offers in order to scam our customers pic.twitter.com/tb0rbDPs1G
— State Bank of India (@TheOfficialSBI) April 20, 2021
ఇవీ చదవండి: కరోనాలోనూ దేశంలో బంగారం దిగుమతుల జోరు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పసిడి ఎంత దిగుమతి అయ్యిందో తెలిస్తే…
LIC: ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు… కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు
LIC Paytm: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త… డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం