Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్‏బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..

Facebook: సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ తమ ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. కొత్తగా సంస్థలో చేరి.. వర్క్ ఫ్రం హోం, రిమోట్‏గా పనిచేయడానికి

Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్‏బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే  యోచనలో సంస్థ..
Facebook
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 21, 2021 | 6:31 PM

Facebook: సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ తమ ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. కొత్తగా సంస్థలో చేరి.. వర్క్ ఫ్రం హోం, రిమోట్‏గా పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ క్రమంలో ఎవరైతే.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రదేశాన్ని వదిలి తమ సొంత దేశాలకు, ఇళ్ళకు వెళ్ళే వారి జీతాలను తగ్గించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీబీసీ నివేదిక ప్రకారం ఫేస్ బుక్ యొక్క పీపుల్ గ్రోత్ వైస్ ప్రెసిడెంట్ బ్రైన్ హారింగ్టన్ మాట్లాడుతూ.. మేము మార్కెట్లో స్థానిక కార్మిక వ్యయం ఆధారంగా చెల్లిస్తాము. కాబట్టి రిమోట్ కార్మికులకు వారి పనిచేసే ప్రదేసం ఆధారంగా వేతనాల విషయంలో వైవిద్యం ఉంటుంది.

కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ క్యాంపస్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తిరిగి భారతదేశానికి వచ్చి రిమోట్‌గా పనిచేయాలని నిర్ణయించుకుంటే, ఉద్యోగి జీతంలో మార్పులు చూడవచ్చు. అతనికి స్థానిక ఉద్యోగుల జీతం ఆదారంగానే చెల్లించబడుతుంది. ఇక అదే సమయంలో రిమోట్ గా పనిచేయడానికి ఫేస్ బుక్ సపోర్టింగ్ ఉద్యోగులకు ఖర్చులు తగ్గించుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని హారింగ్టన్ చెప్పారు. కొంత మంది ఉద్యోగులు పనిచేస్తూనే డెవలప్ అవుతున్నారని బీబీసీ నివేదికలో తెలిపారు. అలాగే చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడానికి సుముఖత చూపిస్తున్నారని తెలిపారు.

ఇక మరికొంత మంది ఉద్యోగులు సంరక్షణ బాధ్యతలు ఉన్నవారు.. చిన్న చిన్న అపార్ట్ మెంట్స్ లలో ఉండే వారు తిరిగి ఆఫీస్ కు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని.. అందుకే పరిస్థితులు కాస్త మారిన తర్వాత ఆఫీస్ ఓపెన్ చేయనున్నట్లుగా వెల్లడించారు.

Also Read: SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..