SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

Jandhan accounts : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోదారులకు పలు బెనిఫిట్స్ అందిస్తోంది.

  • Rajitha Chanti
  • Publish Date - 5:55 pm, Wed, 21 April 21
SBI కస్టమర్లకు శుభవార్త... ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..
State Bank Of India

Pradhan Mantri Jan Dhan Yojana: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోదారులకు పలు బెనిఫిట్స్ అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకంలో భాగంగా అకౌంట్స్ ఓపెన్స్ చేసిన వారికి ఈ సౌకర్యాలు లభిస్తాయి. మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే ఇది మీకు శుభవార్త అనే చెప్పుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండి.. అక్కడే జన్ ధన్ ఖాతా తెరిచినట్లయితే మీరు లక్షాధికారులు అయినట్టే. అదేలా అని ఆలోచిస్తున్నారా. అయితే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే. (jandhan khata)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జన్ ధన్ ఖాతాదారులకు రూ.2 లక్షల వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. ఈ విషయాన్ని ఎస్బీఐ తన వినియోగదారులకు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఎస్బీఐ రూపయ్ జన్ ధన్ కార్డును జన్ ధన్ ఖాతాదారులకు అందిస్తోంది. ఈ కార్డులో వినియోగదారులను రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ సౌకర్యం అందిస్తోంది. రూపే కార్డ్ మీ ఎటిఎం లాగా పనిచేస్తుంది. దీని సహయంతో మీ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్స్ కూడా చేయోచ్చు.

ఎస్పీఐ రూపే జనధన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే మీకు రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుందని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది ఎస్బీఐ. అలాగే రూపే కార్డు సౌకర్యాలను వినియోగదారులను ఉచితంగా ఇస్తుంది.

జన్ ధన్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి..

ఇప్పటివరకు మీరు జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే.. మీ సమీప బ్యాంకుకు వెళ్లి.. జనధన్ ఫారం పూర్తి చేయాలి. అందులో మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని మొదలైనవి పూరించాలి.

ముఖ్య విషయాలు..

1. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
2. జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సహ కెవైసీకి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి.
3. ఒక వేల మీకు ఆ పత్రాలు లేకపోతే మిని అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
4. ఇందులో మీరు ఫోటో, మీ సంతకాన్ని బ్యాంక్ అధికారి ముందే నింపాలి.
5. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ప్రయోజనాలు….

1. ఇందులో యాక్సిడెంటల్ భీమాకు రూ.2 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది.
2. 6 నెలల తర్వాత ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం ఉంటుంది.
3. ఉచిత మొబైల్ బ్యాంకింగ్, డిపాజిట్లపై వడ్డీ ఉంటుంది.
4. రూపే డెబిట్ కార్డ్, దీనితో డబ్బు డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్ చేయవచ్చు.
5. దేశవ్యాప్తంగా నగదు బదిలీ చేయవచ్చు.
6. జన్ ధన్ ఖాతా ద్వారా భీమా, పెన్షన్ డబ్బులు అందుకోవడం సులభం.
7. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల డబ్బు నేరుగా ఖాతాలోకి వస్తుంది.

Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

హాస్పిటల్‌లో ఘోర ప్రమాదం.. భారీ ఆక్సిజన్ సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున లీకేజ్..22 మంది రోగుల మృతి

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడతారా ? అసలు విషయం చెప్పిన భారత్ బయోటెక్ చైర్మన్..