మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్మెంట్కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే..
Corona Virus: దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. ఒకవైపు టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా... కరోనా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది.
Corona Virus: దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. ఒకవైపు టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా… కరోనా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక సరైన చికిత్స లేకపోవడం, ట్రీట్ మెంట్ కోసం కావల్సిన డబ్బుల లేక ఎన్నో కుటుంబాలు ఈ మహమ్మారి ప్రభావంతో విచ్చిన్నం అవుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు.. కరోనా భారీన చికిత్స కోసం వారి డబ్బును డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్). ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎప్ఓ) నిబంధనలలో వైద్య అత్యవసర పరిస్థితి, కొత్త ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు, ఇంటి పునరుద్ధరణ, హోం లోన్ రిటర్న్ పే, మ్యారెజ్ బెనిఫిట్స్ కోసం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చని ఇపీఎఫ్ అధికారులు తెలిపారు. (Covid 19)
ఫీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తి తన జీవిత భాగస్వామి, అతను లేదా తల్లిదండ్రులు, పిల్లల కరోనా చికిత్స కోసం పీఎఫ్ డబ్బును డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ డబ్బును కేవలం అత్యవసర పరిస్థితులలో మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. కోవిడ్ తోపాటు ఇతర వైద్య ఖర్చుల కోసం EPF నుంచి నెలవారీ జీతం లేదా ఉద్యోగి వాటాను వడ్డీతోపాటు పొందవచ్చు. EPF లోన్ అప్లై చేయడానికి ముఖ్యంగా ఉద్యోగి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉండాలి. అలాగే అతని బ్యాంక్ వివరాలు.. తనకు ఉన్న EPF అకౌంట్‌తో కరెక్ట్‌గా పోలీ ఉండాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంటంటే.. EPF విత్ర్ డ్రా చేసిన డబ్బు థార్డ్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్‌కు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుండదు. అలాగే తండ్రిపేరు, ఉద్యోగి పుట్టిన తేదీ వంటి వివరాలు ఎవరైతే లోన్ అప్లై చేస్తున్నారో వారి ఐడి ప్రూఫ్‌తో కరెక్ట్‌గా మ్యాచ్ అయి ఉండాలి.
Also Read: Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..
ప్రతి సంవత్సరం రూ.36 వేలు.. కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్… ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..