ప్రతి సంవత్సరం రూ.36 వేలు.. కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్… ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..

PM Kisan: మహిళలకు కేంద్రం ప్రతి సంవత్సరం రూ.36వేల ఇవ్వనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక స్కీం తీసుకువచ్చింది.

  • Rajitha Chanti
  • Publish Date - 9:02 am, Tue, 20 April 21
ప్రతి సంవత్సరం రూ.36 వేలు.. కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్... ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..
Pm Kisan Maandhan Yojana

PM Kisan: మహిళలకు కేంద్రం ప్రతి సంవత్సరం రూ.36వేల ఇవ్వనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక స్కీం తీసుకువచ్చింది. ఇందులో చేరిన వారికే ఈ డబ్బులు వస్తాయి. ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పెన్షన్ స్కీం కింద ఈ డబ్బులు ఇవ్వనుంది.

ఇప్పటివరకు ఈ పథకంలో 21 లక్షల మందికి పైగా చేరారు. వీరిలో దాదాపు 7 లక్షల మంది ఉన్నారు. వీరిందరికి సంవత్సరానికి రూ.36 వేలు రానున్నాయి. దేశీ దిగ్గజ భీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC డబ్బులు చెల్లిస్తుంది. pm kisan maandhan yojana అయితే ఇందులో చేరేందుకు అందరికీ అవకాశం లేదు. రైతులు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. మహిళా రైతులు కూడా స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

అయితే ఇందులో చేరిన వారు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ళు వచ్చే వరకు కట్టాలి. వయసు ప్రాతిపదికన చెల్లించాల్సిన మొత్తం కూడా మారుతుంది. ఉచితంగానే స్కీమ్ లో చేరోచ్చు. ఒకవేళ మధ్యలో స్కీం నుంచి తప్పుకోవాలనుకుంటే మీ డబ్బులు మీకు వస్తాయి. ఇందులోని సభ్యులు ఆకస్మాత్తుగా మరణిస్తే. భాగస్వామికి సగం డబ్బులు వస్తాయి.

దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి స్కీమ్‌లో చేరొచ్చు. రెండు ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు వంటివి కావాలి. ఇంకా మీకు పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరి ఉంటే.. వచ్చే రూ.6 వేల డబ్బులతోనే మాన్ ధన్ స్కీమ్ డబ్బులు చెల్లించొచ్చు.

Also Read: అయోధ్యపై కరోనా ఎఫెక్ట్.. రామాలయాన్ని మూసివేసిన అధికారులు.. శ్రీరామనవమి వేడుకలకు దూరం..

స్జేజ్ పై డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ ప్రముఖ సింగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Jio Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్‌.. 1 జీబీ డేటాకు కేవలం రూ.3.5 మాత్రమే… పూర్తి వివరాలివే..!