Oxygen Tankers to Telangana: తెలంగాణకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిన జిందాల్ కంపెనీ.. రెమ్‌డెసివిర్‌డోసుల ఉత్పత్తికి సాయం

Oxygen Tankers to Telangana: తెలంగాణకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిన జిందాల్ కంపెనీ..  రెమ్‌డెసివిర్‌డోసుల ఉత్పత్తికి సాయం
Oxygen Supply On The Way To Telangana

తెలంగాణలో ఆక్సిజన్ కొరతను, రెమ్‌డెసివిర్ ఉత్పత్తికి అవసరమైన ఆక్సిన్ అందించేందుకు బళ్లారికి చెందిన జిందాల్ ప్రాక్సేర్ కంపెనీ ముందుకు వచ్చింది.

Balaraju Goud

| Edited By: Team Veegam

Apr 20, 2021 | 12:17 PM


Oxygen Tankers: కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ అంశంపై పలు రాష్ట్రాలు చేసిన విజ్ఞ‌ప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ కొరత నివారించేందుకు పారిశ్రామిక అవసరాలకు సరఫరాను బంద్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆక్సిజన్ కొరతను, రెమ్‌డెసివిర్ ఉత్పత్తికి అవసరమైన ఆక్సిన్ అందించేందుకు బళ్లారికి చెందిన జిందాల్ ప్రాక్సేర్ కంపెనీ ముందుకు వచ్చింది.

బళ్లారికి చెందిన జిందాల్ ప్రాక్సేర్ కంపెనీ 1,600 టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్‌ను హైదరాబాద్‌కు యుద్ధ ప్రాతిపదికన పంపడం జరిగింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డిసిఎ) ఆదేశాల మేరకు హెటెరో డ్రగ్స్, మైలాన్ ల్యాబ్స్‌కు ఆక్సిజన్ ట్యాంకర్లు చేరనున్నాయి. ఈ ఫార్మా కంపెనీలు మరో రెండు రెమ్‌డెసివిర్ ప్రొడక్షన్ యూనిట్లను ప్రారంభించడానికి డిసిఎ అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా మందు ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు ఆక్సిజన్ ట్యాంకర్లను జిందాల్ సంస్థ సరఫరా చేసేందుకు అంగీకరించింది.

రానున్న 15 రోజుల్లో నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ డోసులను ఉత్పత్తి చేయాలని కేంద్ర కేంద్ర రసాయన, ఎరువుల శాఖ భావిస్తోంది. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు అందుబాటులో ఉన్న ఇంజెక్షన్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెమ్‌డెసివిర్ కొరత గురించి పలు రాష్ట్రాలు నివేదించడంతో రెండు వారాల్లోనే 3 లక్షల రెమ్‌డెసివిర్ ఔషధాన్ని బహిరంగ మార్కెట్‌కు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం.

యాంటీ-వైరల్ ఔషధ ప్రమాణాల ఉత్పత్తి వీలైనంత త్వరగా పెరిగేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 20 ప్లాంట్లు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను ఉత్పత్తి చేస్తున్నాయని, ఈ ఇంజెక్షన్ ఉత్పత్తికి మరో 20 ప్లాంట్లలను భారత ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన హెటెరో డ్రగ్స్ రోజుకు 34,000 డోసుల రెమ్‌డెసివిర్ మైలాన్ ల్యాబ్స్ 37,000 డోసుల రెమ్‌డెసివిర్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఉత్పత్తి చేపపడుతోంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఉత్పత్తి కోసం హెటెరో, మైలాన్ల లాబ్స్ ప్రస్తుతం అవి స్టెరిలిటీ వ్యవధిలో ఉన్నందున అవి రెండు వారాల్లో పూర్తిగా పనిచేయనున్నాయి. మరిన్ని ఎక్కువ స్థాయి రెమ్‌డిసివిర్ ఉత్పత్తి చేయనున్నాయి.

డీసిఎ డైరెక్టర్ ప్రీతి మీనా పరిశ్రమతో సమన్వయం చేసుకుని బల్లరీకి ఓక్స్‌జెన్ ట్యాంకర్‌ను పంపించారు. అసారా ఆక్సిజన్ సరఫరాదారుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన ఆధారంగా జిందాల్ 1600 టన్నుల ఓక్స్‌జెన్ ఇవ్వడానికి అంగీకరించింది. మేము మా ట్యాంకర్‌ను వారికి పంపించాము. అది లోడ్ అవుతోంది. మరో ట్యాంకర్ కూడా పంపుతోంది. ఒడిశా ప్లాంట్ ద్వారా మరో ట్యాంకర్ సరఫరా చేయడానికి అంగీకరించినప్పటికీ, సరఫరాకు ఆరు రోజులు పడుతుంది. ఆర్ఐఎన్‌ఎల్ వైజాగ్ నుండి సరఫరా చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్ నేపథ్యంలో గత వారంలో ఆక్సిజన్ వాడకం పెరిగింది. “ప్రస్తుతం, హైదరాబాద్‌తో సహా పరిసర జిల్లాల్లో రోజుకు 300 టన్నుల ఆక్సిజన్ అవసరం పడుతోంది. ఉత్పత్తి 100 టన్నులు మాత్రమే ఉంది. సాధారణంగా, రాష్ట్రంలో 160 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందింది. ఇది రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ సరిపడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో రెండు యూనిట్లు మాత్రమే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. జడ్చర్లలోని ఎల్లానేబరీ, ఐనాక్స్. అయితే, రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్ ద‌ృష్ట్యా మరిన్ని ఆక్సిజన్ యూనిట్ల అవసరం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

Read Also…  అయోధ్యపై కరోనా ఎఫెక్ట్.. రామాలయాన్ని మూసివేసిన అధికారులు.. శ్రీరామనవమి వేడుకలకు దూరం..


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu