- Telugu News Photo Gallery Business photos Reliance jio offers 1gb data for just three and half rupees only with rs 599 plan
Jio Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్.. 1 జీబీ డేటాకు కేవలం రూ.3.5 మాత్రమే… పూర్తి వివరాలివే..!
టెలికాం రంగంలో రోజురోజుకు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఒకరికంటే ఒకరు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇక రిలయన్స్ జియో మాత్రం మొదటి నుంచే...
Updated on: Apr 19, 2021 | 3:46 PM

టెలికాం రంగంలో రోజురోజుకు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఒకరికంటే ఒకరు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇక రిలయన్స్ జియో మాత్రం మొదటి నుంచే టెలికాం రంగంలో దూసుకుపోతోంది. తాజాగా ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. రూ.3.5కే 1జీబీ డేటాను అందిస్తోంది.

రిలయన్స్ జియో రూ.599 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 84 రోజుల వ్యాలిడిటీ ఇస్తోంది. రోజూ 2జీబీ డేటా అందిస్తోంది. అంటే 84 రోజులకు గానూ మొత్తం 168 జీబీ డేటాను అందిస్తోంది జియో. ఈ లెక్కన చూస్తే 1 జీబీ డేటాకు అయ్యే ఖర్చు కేవలం రూ.3.5 మాత్రమే.

ఇతర ప్లాన్‌లతో పోలిస్తే ఈ ప్లాన్ చాలా చౌక అనే చెప్పాలి. ప్రతి రోజు 2జీబీ డేటా అందించే రూ.249, ర.444ను పరిశీలిస్తే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజు. 56 రోజులకు గానూ మొత్తం 112 జీబీ డేటా కస్టమర్లకు అందిస్తోంది జియో. అంటే ఈ లెక్కన చూస్తే.. 1 జీబీ డేటా దాదాపు రూ.4 వరకు చెల్లిస్తున్నట్లు.





